56 కి.మీ దూరం నుంచి రోబోతో ఆపరేషన్.. అమెరికాలో భారత సంతతి డాక్టర్ సంచలనం!
అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ విపుల్ పటేల్ గ్లోబల్ రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 66 ఏళ్ల మార్క్ అనే వ్యక్తికి ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్థారణ అయింది. ఆయన ఈ వినూత్న రోబోటిక్ శస్త్రచికిత్సకు సంబంధించిన క్లినికల్ రీసెర్చ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ ఆపరేషన్ కోసం రోగిని ఫ్లోరిడాలోని అడ్వెంట్‌హెల్త్ ఆసుపత్రిలో ఉంచారు. మరోవైపు డాక్టర్ విపుల్ పటేల్ వేరే ఆసుపత్రిలో ఉండి…
