జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం చాలా మందికి తెలియదు!
సోమవారం శివారాధనకు విశిష్టమైనది కాగా, జ్యేష్ఠ మాసంలో వచ్చే సోమవారం శివపూజకు మరింత ప్రత్యేకమైనది. సోముడు అంటే చంద్రుడితో కూడిన దైవం శివుడు. చంద్రుడు అమృతమయమైన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం. చంద్రుడి ప్రార్థన మేరకు ఈశ్వరుడు అభయాన్ని ప్రసాదించి, ఆయనను తన శిరస్సుపై చంద్రవంకగా ధరించాడు. చంద్రుడికి శివుని అనుగ్రహం చంద్రుని ప్రాముఖ్యతను తెలిపే పురాణ కథ ఒకటి ఉంది. చంద్రునికి మామగారైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వారిలో రోహిణి అంటే చంద్రుడికి…
