Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి తిమింగళం.. 20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్..
హైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి…
హైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఒక లేఔట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే రిపోర్ట్ జారీ చేయాల్సి ఉంది. ఇందుకోసం తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని…
శంకరాభరణం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. కల్ట్ క్లాసిక్‌గా, అజరామర చిత్రంగా నేటికీ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ అద్భుత చిత్రం నిర్మాణం వెనుక కష్టాలు, సవాళ్లు కూడా ఉన్నాయని నటుడు ఎడిద శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, శంకరాభరణం షూటింగ్ అనుకున్నంత సులభంగా సాగలేదు. బడ్జెట్ విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో రూ.12 లక్షలు బడ్జెట్‌తో నిర్మితమైన ఈ కలర్ సినిమా,…
1972 అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాపం పసివాడు చిత్రం అప్పటివరకు తెలుగులో వచ్చిన సినిమాలకు భిన్నంగా నిలిచి ఒక అద్భుతంగా కీర్తించబడింది. ప్రముఖ రచయిత, దర్శకులు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనంగా నిలిచింది. ఒకే ఒక్కడు ప్రాణాలతో మిగిలిన ఆరేళ్ల పసివాడు, అతడితో పాటు ఓ కుక్క పిల్ల ఎడారిలో సాగించిన అన్వేషణ, వారికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రం…
Losing Your Way in a Dream Meaning Telugu: కలల ప్రపంచం ఎంతో ఆసక్తికరమైనది, రహస్యమైనది. కొన్నిసార్లు మనం అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నట్లు కలలు కంటాం. మరికొన్నిసార్లు మనకు తెలియని మార్గాల్లో ప్రయాణిస్తూ, ఎటు వెళ్లాలో అర్థంకాక దారి వెతుక్కుంటూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా గమ్యాన్ని చేరుకోలేకపోతున్నట్లు కూడా కలలు రావచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వాటి వెనుక ఏదైనా అర్థం ఉందా? భవిష్యత్తుకు సంబంధించిన సంకేతమా? అనే సందేహాలు కలగడం సహజం. స్వప్న శాస్త్రానికి…
చర్మ సంరక్షణతో పాటు బరువు తగ్గిన విధానం, ఆహారపు అలవాట్ల గురించి కూడా ఖుష్బూ గతంలో మాట్లాడారు. ఐదేళ్ల వ్యవధిలో 40 కిలోలకుపైగా బరువు తగ్గిన ఆమె, ఈ మార్పు కోసం క్రాష్ డైట్లు లేదా గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం కాకుండా దీర్ఘకాలిక జీవనశైలి మార్పులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆకలి లేకపోయినా తరచూ తినడం కంటే నిజంగా ఆకలి వేసినప్పుడే తినడం, చిన్న ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లను కూడా పాటిస్తున్నట్లు…
Rohit Sharma Emotional: రోహిత్ శర్మ (Rohit Sharma) భారత క్రికెట్ చరిత్రలో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. అయితే అతడి కెరీర్‌లో ఒక దశ మాత్రం తీవ్ర ఇబ్బందులతో నిండిపోయింది. తాజాగా ఆ కఠిన సమయాన్ని రోహిత్ గుర్తుచేసుకుంటూ కీలక విషయాలను వెల్లడించాడు. కెరీర్‌లో అత్యంత కష్టమైన సమయం ఏదంటే..? విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ…
90ల నాటి కుర్రాళ్ల కలల రాణి అంటే గుర్తొచ్చే కథానాయికలు చాలా మంది ఉన్నారు. అందులో మహేశ్వరీ ఒకరు. తెలుగులో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్. ‘గులాబీ’, ‘పెళ్లి’ చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మను సినీ ప్రియులు అంత తేలికగా మరచిపోలేరు. తన అమాయకమైన చూపులు, సహజసిద్ధమైన నటనతో ఆనాటి యూత్‌ను కట్టిపడేసిన ఈ భామ, ‘నీకోసం’ సినిమాకు గాను నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. కేవలం సినిమాలే కాకుండా అటు బుల్లితెరపై…
West Indies Failed Plan B Against Abhishek Sharma Dominance: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. అయితే అభిషేక్‌ను కట్టడి చేసేందుకు విండీస్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగినట్లు మ్యాచ్ అనంతరం ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోర్‌లో అభిషేక్ విధ్వంసం…..
స్వయం ఉపాధి పొందేందుకు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. దీంతో ఏ వ్యాపారం మొదలుపెట్టాలా? అని చాలామంది మదన పడుతుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం కోసం వెతుకుతుంటారు. ఇందుకోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీవారికి అడగడం, గూగుల్‌లో సెర్చ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారిని అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ కస్టమర్లు, అధిక ఆదాయం వచ్చే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి అనేక అవకాశాలు ఉన్నాయి….
రైల్వే ట్రాక్ మధ్యలో, చుట్టుపక్కల వేసే ఈ రాళ్లను 'ట్రాక్ బ్యాలస్ట్' అంటారు. ఇవి పట్టాలను సరైన దూరంలో స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సాధారణంగా పగులగొట్టిన గట్టి రాళ్లతో తయారు చేస్తారు. ఇండియన్ రైల్వేస్ (RDSO) ప్రకారం.. బ్యాలస్ట్ స్లీపర్లకు సమతల పడకను అందించి, వాటిని కదలకుండా స్థిరంగా పట్టి ఉంచుతుంది. రైలు చక్రాల నుంచి వచ్చే భారీ భారాన్ని నేలపై విస్తృత ప్రాంతానికి సమానంగా పంచుతుంది. ఈ రాళ్లు నునుపుగా కాకుండా…