తాజావార్తలు

Mysaa Movie: రష్మికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. గూస్‌బంప్స్ తెప్పించేలా ‘మైసా’ మూవీ ఫస్ట్ సాంగ్


నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘మైసా’. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో సరికొత్త అవతారంలో కనిపించనుంది. గిరిజన గోండు మహిళ పాత్రలో ఆమె పవర్‌ఫుల్ రోల్ పోషించింది. రవీంద్ర పుల్లె తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే మైసా చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘ఓ మైసా రే’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ఆడియెన్స్ కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మహిళా శక్తిని, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా ఈ పాట సాగుతూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఉరుముల్లాంటి బీట్స్‌తో సాగే ఈ పాట ఆద్యంతం అదే టెంపో, ఎనర్జీని కొనసాగిస్తూ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. ఇక ఈ సాంగ్ లో రష్మిక ఉగ్ర అవతారంలో కనిపించింది. సాంగ్ లో ఆమె చూపించిన ఎక్స్ ప్రెషన్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట లిరిక్స్ కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయి. అలాే జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్ ఈ సాంగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. మొత్తానికి ప్రస్తుతం యూట్యూబ్ లో ‘ఓ మై సారే’ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇక మైసా సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో రష్మికతో పాటు సముద్ర ఖని, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మైసా’ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ తో సినిమాపై అంచనాలు అమాంతం మరింత పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

రష్మిక మందన్నా ‘మైసా’ ఫస్ట్ సింగిల్



ఇవి కూడా చదవండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *