తాజావార్తలు

కాలినడకన ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహసికుడు! 28 ఏళ్లు.. 29 దేశాలు.. 50 వేల కి.మీ!

బ్రిటన్‌కు చెందిన కార్ల్ బుష్బీ 1998 నవంబర్‌ 1న తన ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. దక్షిణ అమెరికాలోని చిలీ దేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని చుట్టి, చివరకు ఉత్తర ఇంగ్లండ్‌లోని హల్‌ (Hull) సమీపంలో ఉన్న తన తల్లి ఇంటికి చేరుకోవాలన్నది అతడి లక్ష్యం. అప్పటికి అతడి వయసు 29 ఏళ్లు. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు బుష్బీ తనకు తానే రెండు కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు. మొదటిది.. తన ప్రయాణంలో ఎలాంటి రవాణా సాధనాలను ఉపయోగించకూడదు….

Read More

60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి..! ‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే’

చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జుమాడియన్ సెంట్రల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17న జాంగ్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరగ్గా.. పాప పుట్టినప్పుడు 2.8 కిలోల బరువు ఉంది. రెండేళ్ల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బాబును కుటుంబ సభ్యులు ముద్దుగా ‘గువోగువో’ అని పిలుచుకుంటారు. 60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కావడం అరుదైన విషయమే. ముఖ్యంగా ఈ వయసులో గర్భధారణ, ప్రసవం అనేవి వైద్యపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. అయినప్పటికీ, ఇద్దరు చిన్నారులతో…

Read More

Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి తిమింగళం.. 20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్..

హైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఒక లేఔట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే రిపోర్ట్ జారీ చేయాల్సి ఉంది. ఇందుకోసం తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని…

Read More

Cinema : క్లాసికల్ సినిమా ఆడదు అని ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లకు క్యూ కట్టిన జనాలు..

శంకరాభరణం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. కల్ట్ క్లాసిక్‌గా, అజరామర చిత్రంగా నేటికీ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ అద్భుత చిత్రం నిర్మాణం వెనుక కష్టాలు, సవాళ్లు కూడా ఉన్నాయని నటుడు ఎడిద శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, శంకరాభరణం షూటింగ్ అనుకున్నంత సులభంగా సాగలేదు. బడ్జెట్ విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో రూ.12 లక్షలు బడ్జెట్‌తో నిర్మితమైన ఈ కలర్ సినిమా,…

Read More

Cinema : హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇదే..

1972 అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాపం పసివాడు చిత్రం అప్పటివరకు తెలుగులో వచ్చిన సినిమాలకు భిన్నంగా నిలిచి ఒక అద్భుతంగా కీర్తించబడింది. ప్రముఖ రచయిత, దర్శకులు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనంగా నిలిచింది. ఒకే ఒక్కడు ప్రాణాలతో మిగిలిన ఆరేళ్ల పసివాడు, అతడితో పాటు ఓ కుక్క పిల్ల ఎడారిలో సాగించిన అన్వేషణ, వారికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రం…

Read More

Dream Meaning: కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

Losing Your Way in a Dream Meaning Telugu: కలల ప్రపంచం ఎంతో ఆసక్తికరమైనది, రహస్యమైనది. కొన్నిసార్లు మనం అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నట్లు కలలు కంటాం. మరికొన్నిసార్లు మనకు తెలియని మార్గాల్లో ప్రయాణిస్తూ, ఎటు వెళ్లాలో అర్థంకాక దారి వెతుక్కుంటూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా గమ్యాన్ని చేరుకోలేకపోతున్నట్లు కూడా కలలు రావచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వాటి వెనుక ఏదైనా అర్థం ఉందా? భవిష్యత్తుకు సంబంధించిన సంకేతమా? అనే సందేహాలు కలగడం సహజం. స్వప్న శాస్త్రానికి…

Read More

Skin Care Secrets: 56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ వాడే ఆ ఇంటి చిట్కా ఏమిటో తెలుసా?

చర్మ సంరక్షణతో పాటు బరువు తగ్గిన విధానం, ఆహారపు అలవాట్ల గురించి కూడా ఖుష్బూ గతంలో మాట్లాడారు. ఐదేళ్ల వ్యవధిలో 40 కిలోలకుపైగా బరువు తగ్గిన ఆమె, ఈ మార్పు కోసం క్రాష్ డైట్లు లేదా గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం కాకుండా దీర్ఘకాలిక జీవనశైలి మార్పులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆకలి లేకపోయినా తరచూ తినడం కంటే నిజంగా ఆకలి వేసినప్పుడే తినడం, చిన్న ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లను కూడా పాటిస్తున్నట్లు…

Read More

‘ఆ సమయంలో బాగా ఏడ్చాను.. నా కెరీర్‌లో అత్యంత చీకటి రోజులవే..’: రోహిత్ శర్మ

Rohit Sharma Emotional: రోహిత్ శర్మ (Rohit Sharma) భారత క్రికెట్ చరిత్రలో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. అయితే అతడి కెరీర్‌లో ఒక దశ మాత్రం తీవ్ర ఇబ్బందులతో నిండిపోయింది. తాజాగా ఆ కఠిన సమయాన్ని రోహిత్ గుర్తుచేసుకుంటూ కీలక విషయాలను వెల్లడించాడు. కెరీర్‌లో అత్యంత కష్టమైన సమయం ఏదంటే..? విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ…

Read More

Maheshwari: గులాబీ భామ మహేశ్వరి గుర్తుందా.. ? ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్..

‏90ల నాటి కుర్రాళ్ల కలల రాణి అంటే గుర్తొచ్చే కథానాయికలు చాలా మంది ఉన్నారు. అందులో మహేశ్వరీ ఒకరు. తెలుగులో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్. ‘గులాబీ’, ‘పెళ్లి’ చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మను సినీ ప్రియులు అంత తేలికగా మరచిపోలేరు. తన అమాయకమైన చూపులు, సహజసిద్ధమైన నటనతో ఆనాటి యూత్‌ను కట్టిపడేసిన ఈ భామ, ‘నీకోసం’ సినిమాకు గాను నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. కేవలం సినిమాలే కాకుండా అటు బుల్లితెరపై…

Read More

IND vs WI: ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా తుక్కుతుక్కుగా దంచేశాడయ్యా..!

West Indies Failed Plan B Against Abhishek Sharma Dominance: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. అయితే అభిషేక్‌ను కట్టడి చేసేందుకు విండీస్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగినట్లు మ్యాచ్ అనంతరం ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోర్‌లో అభిషేక్ విధ్వంసం…..

Read More