తాజావార్తలు

Rebel Star Prabhas: డ్రగ్స్‌పై పోరాటానికి ప్రభాస్ మద్దతు.. యువతకు రెబల్ స్టార్ పిలుపు!


Rebel Star Prabhas: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి సినీ నటుడు ప్రభాస్ మద్దతు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో జరగనున్న అవగాహన యాత్రలో యువత పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్ భారత్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

అందులో భాగంగా ఈ నెల 25 నుంచి 27 వరకు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో మూడు రోజుల పాటు పాదయాత్ర జరగనుంది. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభాస్.

మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ప్రభాస్ ఇంటికి వెళ్లి కలిశారు. అవగాహన యాత్రలో పాల్గొని యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుతూ.. నషా ముక్త్ భారత్ లోగోతో ఉన్న ప్రత్యేక టీ-షర్ట్‌లను ప్రభాస్‌కు అందజేశారు. డ్రగ్స్‌పై పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆనాడు మాట ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు వీడియో రిలీజ్ చేసి మరోసారి తన సపోర్ట్‌ తెలిపారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *