తాజావార్తలు

రైల్వేలో 1688 ఉద్యోగాలకు RRB NTPC అండర్ గ్రాడ్యుయెట్‌ నోటిఫికేషన్‌.. ఇంటర్ పాసైతే చాలు!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ మరో తీపికబురు అందించింది. రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) పోస్టుల భర్తీకి CEN 07/2026 అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1688 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ పరిధిలో 72…

Read Full News

ఉసిరికాయ ముక్కల పచ్చడి.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. ఇలా తయారు చేయండి

ఒక కప్పు పల్లి నూనెను పాన్‌లో వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి, మధ్యస్థ మంటపై ఐదు నిమిషాల పాటు వేయించండి. ముక్కలు పూర్తిగా మెత్తబడకుండా, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. వేగిన ముక్కలను నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోండి.ముక్కలు వేయించిన అదే నూనెలో అర టీస్పూన్ ఆవాలు, మూడు-నాలుగు ఎండుమిర్చి తుంపి వేయండి. ఒక వెల్లుల్లి గడ్డ రెబ్బలను తీసి వేసి, కొద్దిసేపు వేగనివ్వండి. పోపు వేగిన తర్వాత…

Read Full News

వేల టన్నుల బోగీలను ఒక్క ఇంజిన్ ఎలా లాగుతుంది?.. దీని వెనకున్న అసలు రహస్యం ఇదే..

సాధారణంగా బోగీల బరును ట్రైనే మోస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ట్రైన్‌లోని పదుల సంఖ్యలోని బోగీల బరువు మొత్తాన్ని పట్టాలే మోస్తాయి. లోకోమోటివ్ చేసే పనేమిటంటే గాలి నిరోధకత, రోలింగ్ రెసిస్టెన్స్‌ను అధిగమిస్తూ బోగీలను ముందుకు లాగడమే. ట్రైన్‌కు ఉండే స్టీల్ చక్రాలు స్టీల్‌ పట్టాలపై నడవడం వల్ల ఘర్షణ, శక్తి నష్టం చాలా తక్కువగా ఉంటాయి. ఇంజన్ బరువు చక్రాలను బలంగా నొక్కి పట్టాలపై తిరుగులేని గ్రిప్‌ను అందిస్తుంది. మనకు ట్రైన్‌లలో డీజిల్, ఎలక్ట్రిక్…

Read Full News

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ కీలక ప్రకటన.. మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల జాబితా విడుదల!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌, మున్సిపాలిటీల చైర్మన్‌, నగర పంచాయతీల చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పలు కీలక పట్టణాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ జాబితాలో పేర్కొంది. ముఖ్యంగా విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా రాయని భాగ్యలక్ష్మి పేరును ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కార్పొరేషన్లకు ప్రకటించిన అభ్యర్థులు వైసీపీ ప్రకటించిన వివరాల ప్రకారం.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా…

Read Full News

స్వచ్ఛంద సంస్థకు గుర్తు తెలియని వ్యక్తి పాత నోట్లు విరాళం .. వేలంలో రూ. కోటి పై మాటే!

సాధారణంగా ఆ షాపుకు ప్రజలు పాత వస్తువులు, దుస్తులు, పుస్తకాలు విరాళంగా ఇస్తుంటారు. అయితే ఈసారి వచ్చిన కరెన్సీ నోట్లలో ఎంతో అరుదైనవి ఉన్నాయి. తొలుత వాటి విలువ గురించి షాప్ సిబ్బందికి పెద్దగా అవగాహన లేదు. షాప్‌లోని సిబ్బంది ఆ నోట్లను పరిశీలించినా వాటి ప్రత్యేకతను గుర్తించలేకపోయారు. దీంతో వాటిని మరింత లోతుగా పరిశీలించేందుకు లీడ్స్‌లోని తమ ఈబే బృందానికి పంపించారు. అక్కడ నోట్ల విలువ గురించి తెలుసుకున్న తర్వాత సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అరుదైన…

Read Full News

ఒంట్లో వేడిని తరిమికొట్టే సగ్గుబియ్యం లడ్డూలు.. ఇంట్లోనే ఇలా చేసేయండి

ముందుగా ఒక కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకొని, వాటిని కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. మామూలు సగ్గుబియ్యం వాడినా లడ్డూలు వస్తాయి, కానీ నైలాన్ సగ్గుబియ్యం వాడటం వల్ల నాణ్యత మెరుగుపడుతుంది. నానిన తర్వాత, సగ్గుబియ్యాన్ని జాలి గరిటెలోకి వేసి, నీరంతా పూర్తిగా పోయే వరకు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత, ముక్కలుగా తరిగిన బాదం పప్పులను…

Read Full News

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందంటే?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. మొత్తం కార్పొరేషన్లలో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాల్లో బరిలోకి దిగుతుండగా, జనసేన, భారతీయ జనతా పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. కూటమి సీట్ల సర్దుబాటు ప్రకారం: 11 మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ టీడీపీ చేయనుండగా.. 4 మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన బరిలో నిలవనుంది. ఇక 2 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ పోటీకి సిద్ధమైంది. పార్టీల వారీగా కేటాయించిన కార్పొరేషన్ల…

Read Full News

చైనా విడిభాగాలతో.. సొంతంగా క్షిపణుల తయారీలో హౌతీలు .. ఇజ్రాయెల్‌, సౌదీ పై గురి!

మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ ఆయుధ సంపత్తిని పెంచుతున్నారు. ఇప్పటివరకు ఇరాన్ ఆయుధాలు, సాంకేతిక సహాయంపై ఆధారపడిన ఈ గ్రూప్.. ఇప్పుడు క్షిపణులు, డ్రోన్ల విడిభాగాలను సేకరించి సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే ప్రయత్నాల్లో ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్, బ్లూమ్‌బెర్గ్ పరిశోధనాత్మక కథనాలు తెలిపాయి. చైనా నుంచి విడిభాగాలు ..నాలుగు కంటైనర్లలో ఏమున్నాయి? ఏడెన్ ఓడరేవులో అధికారులు నాలుగు షిప్పింగ్ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు….

Read Full News

కీళ్ళ మధ్య జిగురు ఉత్పత్తి చేసి మోకాళ్ల నొప్పిని తగ్గించే సహజ చికిత్స.. రోజూ చేస్తే లేచి పరుగులు పెట్టాల్సిందే

ప్రస్తుత రోజుల్లో, మోకాళ్ళ నొప్పులు కేవలం వృద్ధులకే కాకుండా 30-40 ఏళ్ల వారికీ సాధారణమయ్యాయి. అయితే ఈ సమస్యకు ఆపరేషన్ అవసరం లేకుండా సహజసిద్ధమైన పద్ధతులు, ఆధునిక చికిత్సల ద్వారా చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో జరిగిన పరిశోధనల ప్రకారం, లో ఇంటెన్సిటీ పల్స్డ్ అల్ట్రాసౌండ్ (LIPUS) చికిత్స మోకాళ్ళ నొప్పులు తీవ్రం కాకుండా నివారిస్తుందని, ముఖ్యంగా గ్రేడ్ 1, 2 దశల్లో ఉన్నప్పుడు వాపు, నొప్పిని గణనీయంగా తగ్గిస్తుందని రుజువైంది. అలాగే కొన్ని…

Read Full News

Fruits Storage: అరెరే ఇన్నాళ్లు తప్పు చేశామా?.. ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినడం ఇంత డేంజరా?

పైనాపిల్, మామిడిపండ్లు: పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడితే దాని రుచి, స్వభావం తగ్గిపోతుంది. ఫ్రిజ్‌లోని చల్లదనం పండును మరీ మెత్తగా మార్చి, దాని సహజసిద్ధమైన వాసనను దూరం చేస్తుంది. కాబట్టి పైనాపిల్‌ను గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మంచిది. మామిడిపండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే మామిడి వేడి లేదా గది ఉష్నోగ్రత వద్దే త్వరగా మాగుతుంది. ప్రిజ్‌లో పెడితే సహజమైన తీపి రుచి, గుజ్జు స్వభావం పూర్తిగా మారిపోతాయి.

Read Full News