తాజావార్తలు

Scene OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ‘సీన్’!.. సూర్య- నజ్రియాల 300 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు 2026 మరుపురాని సంవత్సరంగా మారిపోయిది. ఈ ఏడాది ప్రారంభంలో ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సూర్య. ఆ తర్వాత ఆగస్టులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీతో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక సూర్య హీరోగా ఇటీవలే రిలీజైన సీన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ‘ఆవేశం’, ‘రోమాంచం’ చిత్రాల ఫేమ్ మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ దీపావళి కానుకగా నవంబర్ 06న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ సీన్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే సూర్య సినిమా రూ. 300 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ సీన్ సినిమా చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోంది. అయితే త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సీన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం సినిమా నిర్మాతలకు సుమారు రూ. 85కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన 4 వారాలకే సినిమాను స్ట్రీమింగ్ చేయాలని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన డిసెంబర్ 4 నుంచి సీన్ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీన్ సినిమా విషయానికి వస్తే.. అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. సూర్య సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రేమలు హీరో నస్లెన్ సైకో విలన్ గా యాక్ట్ చేశాడు. వీరితో పాటు జై, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.సుశిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక స్టోరీ విషయానికి వస్తే.. దృష్టి లోపమున్న ఒక పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ ఇన్బరాజ్ గా సూర్య), విచిత్రమైన మనస్తత్వం కలిగిన ఒక కాంట్రాక్ట్ కిల్లర్ మధ్య జరిగే దొంగ పోలీస్ ఆటగా ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఈ సినిమా సాగుతుంది. ముఖ్యంగా విలన్ పాత్రలో నస్లేన్ అదరగొట్టాడని చెప్పవచ్చు.

సూర్య సీన్ సినిమా ట్రైలర్..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *