తాజావార్తలు

Andhra News: ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.97 కోట్లు స్వాహ.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..

ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో అమాయకులను, చదువుకున్న యువతను సైతం బురిడీ కొట్టిస్తూ కోట్లలో దండుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీవోల పేరిట అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.1,97,60,870 కొల్లగొట్టారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన పర్చూరి సురేష్…

Read Full News

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్.. వీడియో వైరల్.. ఈ ట్విస్ట్ ఊహించలేదు

బుల్లితెర ఆడియెన్స్ ఫెవరేట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆరో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. ఇక పోతే మొదటివారం చైత్ర ,చరణ్ ఎలిమినేట్ అయ్యారు.. కానీ చరణ్ కి మరో అవకాశం లభించింది. రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్…

Read Full News

Jio IPO: దేశంలో 60 శాతం డేటా ట్రాఫిక్ జియోదే.. భవిష్యత్ వ్యూహాలను వెల్లడించిన ఆకాష్ అంబానీ

టెలికాం విప్లవంతో భారత్‌ను డిజిటల్ దిగ్గజంగా నిలిపిన జియో ప్లాట్‌ఫామ్స్ టెక్నాలజీ ఆవిష్కరణల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు భారత్‌తో పాటు విదేశాల్లో కలిపి మొత్తం 7,220 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసినట్లు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ప్రకటించారు. అంతర్జాతీయ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్-20 దరఖాస్తుదారుల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ సంస్థగా జియో నిలిచిందని ఆయన గర్వంగా వెల్లడించారు. మెగా ఐపీఓ…

Read Full News

Fresh Eggs Test: గుడ్లు తాజాగా ఉన్నాయా? పాడయ్యాయా? పగలగొట్టే ముందు ఈ పరీక్ష చేయండి!

గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి నీటిలో వేసి చూడటం, పగలగొట్టిన తర్వాత వాసనను గమనించడం, లోపలి రంగు, రూపాన్ని పరిశీలించడం వంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ పరీక్షలన్నీ గుడ్డు సురక్షితంగా ఉందని పూర్తిగా నిర్ధారించలేవు. ముఖ్యంగా గుడ్డు నీటిలో తేలిందని మాత్రమే అది పాడైందని చెప్పలేం. గుడ్లను సరిగ్గా నిల్వ చేయడం, వండేటప్పుడు పూర్తిగా ఉడికించడం కూడా అంతే ముఖ్యం. 1. నీటిలో వేసి గుడ్డు తాజాదనాన్ని తెలుసుకోండి ఇంట్లో గుడ్డు ఎంత…

Read Full News

Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ రిలీజ్.. నటి పూర్ణకు భారీ కటౌట్.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో థియేటర్ల వద్ద రజనీ అభిమానుల హంగామా కనిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీతో పాటు పలువురు స్టార్ యాక్టర్స్ కూడా ఉన్నారు. రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, విద్యాబాలన్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు,…

Read Full News

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చేసింది

చాలామంది తమ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఆ సిస్టమ్‌ను ఇతరులు వాడినప్పుడు వ్యక్తిగత చాట్‌లు కనిపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ, వినియోగదారుల వ్యక్తిగత, ముఖ్యమైన సంభాషణలకు పూర్తి భద్రత కల్పించేందుకు వాట్సాప్ ఈ సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అదే రిస్ట్రిక్టెడ్ చాట్.. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఆ చాట్‌లు ఇతరులకు కనిపించవు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత సంభాషనను ప్రైవసీగా ఉంచుతుంది. రిస్ట్రిక్టెడ్…

Read Full News

Life Lesson: నెగెటివ్‌ థాట్స్ బలవంతంగా ఆపుతున్నారా..? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!

ఒక బౌద్ధ ఆశ్రమంలో ఒక జెన్ గురువు నివసించేవాడు. ఆయన దగ్గరకు ఒకరోజు ఓ వ్యక్తి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ‘గురువుగారూ! నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం లేదు. నిరంతరం ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో చాలా ప్రతికూలమైనవి. ఎంత ప్రయత్నించినా ఆలోచనలను ఆపలేకపోతున్నాను. దయచేసి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏదైనా మంత్రం చెప్పండి’ అని వేడుకున్నాడు. అప్పుడు జెన్ గురువు చిరునవ్వుతో ‘నాయనా! ప్రతిరోజూ కొంతసేపు ధ్యానం చేయడం…

Read Full News

Abhishek Sharma: 200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ?

Abhishek Sharma: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 2-2తో సమంగా నిలిచాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన యంగ్ సంచలనం అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సాధారణంగా దూకుడుగా ఆడే అభిషేక్ ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొని కేవలం 29…

Read Full News

Central Government: ఇన్‌కమింగ్ కాల్స్‌కు కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..

స్పామ్ కాల్స్‌ ద్వారా ఇటీవల అనేక మోసాలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా సైబర్ మోసాల బారిన ఎక్కువమంది పడుతున్నారు. ఇప్పటికే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు టెలికాం విభాగం అనేక కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. అయితే నవంబర్ 1 నుంచి టెలికమ్యూనికేషన్ విభాగం(DoT) కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. అదే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఫీచర్. దీనిని వచ్చే నెల ఒకటో లేదీ నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని టెలికాం…

Read Full News

ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు.. కట్ చేస్తే భారీ నెట్‌వర్క్‌ బట్టబయలు!

నాగసౌమ్య ప్రియుడు మూడు నెలల క్రితం డ్రగ్స్‌ దందా కేసులో చిత్తూరులో అరెస్టయ్యాడు. అతడికి బెయిల్‌ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు కోసం నాగసౌమ్య డ్రగ్స్‌ తరలించే పనికి అంగీకరించింది. ఈ క్రమంలో బషీర్‌ అనే వ్యక్తి ఆమెకు రూ.50 వేల ఆఫర్‌ చేశాడు. బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్‌ను సురక్షితంగా తీసుకొస్తే రూ.50 వేలు ఇస్తానని బషీర్‌ చెప్పడంతో, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో నాగసౌమ్య ఈ పనికి అంగీకరించినట్లు విచారణలో వెల్లడించింది. బెంగళూరు నుంచి విజయవాడకు…

Read Full News