సాధారణంగా బోగీల బరును ట్రైనే మోస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ట్రైన్‌లోని పదుల సంఖ్యలోని బోగీల బరువు మొత్తాన్ని పట్టాలే మోస్తాయి. లోకోమోటివ్ చేసే పనేమిటంటే గాలి నిరోధకత, రోలింగ్ రెసిస్టెన్స్‌ను అధిగమిస్తూ బోగీలను ముందుకు లాగడమే. ట్రైన్‌కు ఉండే స్టీల్ చక్రాలు స్టీల్ పట్టాలపై నడవడం వల్ల ఘర్షణ, శక్తి నష్టం చాలా తక్కువగా ఉంటాయి. ఇంజన్ బరువు చక్రాలను బలంగా నొక్కి పట్టాలపై తిరుగులేని గ్రిప్‌ను అందిస్తుంది.
మనకు ట్రైన్లలో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్ల పవర్ హౌస్ రెండు ఉంటాయి. డీజిల్ ఇంజిన్‌లో సిలిండర్ల ద్వారా ఉత్పన్నమయ్యే మెకానికల్ శక్తిని ట్రాక్షన్ ఆల్టర్నేటర్ విద్యుత్‌గా మార్చి మోటార్లకు అందిస్తాయి. కానీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌కు ఈ ఇంధన ట్యాంకులు ఉండవు. పైకప్పుపై ఉండే ప్యాంటోగ్రాఫ్ ద్వారా ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల నుంచి కరెంట్‌ను సేకరించి, పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ద్వారా నియంత్రించి చక్రాల మోటార్లకు అందిస్తుంది.
లోకోమోటివ్‌లో మోటార్ ఒకే కాకుండా ప్రతి రెండు చక్రాల వద్ద విడివిడిగా ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ వీటికి కావాల్సినంత మాత్రమే విద్యుత్‌ను అందిస్తుంది. మోటార్లకు ఉండే చిన్న గేర్లు యాక్సిల్‌కు ఉన్న పెద్ద గేర్లను శక్తివంతంగా తిప్పడం ద్వారా చక్రాలు వేగంగా కదిలి ట్రైన్ ముందు వెళ్తోంది. .
రైలుకు ఇతర వాహనాల్లా స్టీరింగ్ ఉండదు. చక్రాలు కోన్ ఆకారంలో టేపర్ చేయబడి లోపలి వైపు వెడల్పుగా, బయటి వైపు సన్నగా ఉంటాయి. టర్నింగ్ వద్ద చక్రాల అమరిక వల్ల బయటి చక్రం ఎక్కువ దూరం, లోపలి చక్రం తక్కువ దూరం కవర్ చేస్తూ రైలు సులభంగా మళ్లేలా సహకరిస్తాయి. పట్టాలపై గ్రీజ్ లేదా దుమ్ము వల్ల గ్రిప్ తగ్గితే చక్రాల వద్ద పైపుల ద్వారా ఇసుకను చల్లి ట్రాక్షన్‌ను పెంచుతారు.
రైలు బోగీలన్నింటినీ కలిపే బ్రేక్ పైపులోని గాలి పీడనాన్ని తగ్గించడం ద్వారా ఎయిర్ బ్రేకులు పడుతాయి. కొండ ప్రాంతాలు, సుదీర్ఘ ప్రయాణాల్లో బ్రేక్ ప్యాడ్లు అరిగిపోకుండా ఉండేందుకు మోటార్లను రివర్స్‌లో తిప్పి రీజెనరేటివ్ బ్రేకింగ్ వాడుతారు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఎలక్ట్రిక్ రైళ్లు తిరిగి ఓవర్‌హెడ్ లైన్లలోకి పంపుతాయి, డీజిల్ రైళ్లు వేడి రూపంలో బయటకు విడుదల చేస్తాయి.
ట్రైన్ నడితే లోకోపైలట్ అజాగ్రత్తగా ఉన్నా, రెడ్ సిగ్నల్‌ను చూడపోయినా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రైన్లలో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్‌ను వాడుతారు. ఇది రైలు వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు క్యాబిన్లో వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ డ్రైవర్ ఈ వార్నింగ్‌ను గమనించకపోతే.. ఈ సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి ట్రైన్‌ను సేఫ్‌గా ఆపేస్తుంది.






