కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం
కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న పైలట్ దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో, సదరు పైలట్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. అనంతరం, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అందులో పైలట్ విఫలమయ్యారు. విధి నిర్వహణకు శారీరకంగా అనర్హుడని నిర్ధారించిన వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది,…
