తాజావార్తలు

EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?

EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?


ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పీఎఫ్ అకౌంట్ నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి సంబంధించిన నిబంధనలను EPFO ​​సవరించింది. ఇప్పటివరకు వైద్య ఖర్చులు, గృహ నిర్మాణం, అనారోగ్యం, వివాహం, వైకల్యం వంటి వివిధ ప్రయోజనాల కోసం నిధులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. తాజాగా వికలాంగులైన PF ఖాతాదారుల కోసం నిబంధనలను ఈపీఎఫ్ఓ విస్తరించింది. ఒక ఖాతాదారుడు పూర్తిగా అంగవైకల్యానికి గురైనా, పాక్షికంగా గురైనా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంత శాతం నగదును తీసుకోవచ్చు? ఏమైనా డాక్యుమెంట్స్ సమర్పించారా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

100 శాతం సొమ్ము తీసుకోవచ్చు..?

పూర్తిగా అంగవైకల్యానికి గురై భవిష్యత్తులో పని చేయలేకపోతే తమ ఖాతాలోని బ్యాలెన్స్‌లో 100 శాతం విత్ డ్రా చేసుకోవ్చు. PF ఖాతాదారుడు పని చేయడానికి పూర్తిగా అసమర్థుడై ఉండాలి. ఈ మొత్తంలో ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటాలు ఉంటాయి. ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు పాక్షికంగా అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా నిబంధనలను తెచ్చింది. PF ఖాతాదారుడు పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే.. వైద్య చికిత్స, ఇతర ఖర్చుల కోసం నిధులను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంది. ఆరు నెలల బేసిక్ శాలరీ, డిఏకు సమానమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. PF ఖాతాలో తప్పనిసరిగా 25 శాతం బ్యాలెన్స్ ఉండాలి.

ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం

అయితే ఈ నగదును పొందేందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. ఎలాంటి వైద్య పత్రాలు లేదా ప్రోఫార్మాలు అవసరం లేదు. పాక్షికంగా అంగవైకల్యం ఉన్న ఖాతాదారుడు నిధులను ఉపసంహరించుకోవడానికి కేవలం ఫారం 31ని సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఒక అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. KYC, ఇతర పత్రాలన్నీ పూర్తి చేసి ఉంటే మూడు రోజుల్లోగా నిధులు ఖాతాలో జమ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *