మంటను పూర్తిగా లో-ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా జాగ్రత్తపడాలి. జొన్న నూక మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారే కొద్దీ అది గట్టిపడి పర్ఫెక్ట్ ముద్దలా తయారవుతుంది. ఈ కమ్మని జొన్న బువ్వను అరటికాయ పులుసు, పప్పుచారు, తోటకూర పులుసు లేదా చికెన్, మటన్ లాంటి నాన్-వెజ్ కూరలతో తింటే అద్భుతంగా ఉంటుంది.
