తాజావార్తలు

అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!

అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!


నగరాలు ఎంతగా విస్తరిస్తున్నా, ప్రకృతి తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. నగరంలోని ఒక ప్రముఖ అపార్ట్‌మెంట్ సమీపంలో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ చేసిన నాట్యం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి స్థానికులు మొబైల్‌లో రికార్డ్ చేసిన ఈ అరుదైన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోలో.. ఒక సిమెంట్ పిల్లర్, పచ్చటి గడ్డి మధ్య రెండు పెద్ద పెద్ద పాములు గాల్లోకి లేస్తూ వింతగా కదులుతున్నాయి. అద్భుతమైన దృశ్యాన్ని చూసి స్థానికులు భయాందోళనలతో పాటు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు నగరాల్లోనూ ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడం పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు భారీ సర్పాలు తమ సహజ విన్యాసానికి ఓ ఆపార్ట్‌మెంట్‌ పక్కనక ఖాళీ స్థలాన్ని వేదికగ చేసుకున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడం.. ఇది పాములు జతకట్టే సమయం కావడంతో..ఇలాంటి దృశ్యాలు సహజమేనని వన్యప్రాణి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట చేరడమే ఆలస్యం, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “ఇది అపార్ట్‌మెంట్ కాదు, ఏకంగా స్నేక్ పార్క్‌లా ఉంది బాబోయ్!” అని కామెంట్లు పెడుతున్నారు. అయితే, హిందూ సంస్కృతిలో పాముల జంట నాట్యం ఆడుతుంటే చూడకూడదనే బలమైన విశ్వాసం ఉంది. అ సమయంలో పాములను చూస్తే దోషం తగులుతుందని నమ్ముతారు. దీంతో వీడియోను చూడవద్దంటూ కొందరు కామెంట్ల రూపంలో ఇతరులను హెచ్చరించడం విశేషం. ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి భారీ సర్పాలు నివాస ప్రాంతాల వద్ద కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

Basara: బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత!

రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *