Ghee Test: మీరు కొన్న నెయ్యి.. అసలైనదా.. కల్తీగా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఈజీగా కనిపెట్టండి!
హిందువుల్లో నెయ్యిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవుళ్లకు పెట్టే నైవేద్యాలు, ప్రసాదాల్లో దీన్ని ఎక్కువగా వాడుతారు. మన దేశంలో నెయ్యికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు డబ్బులు దండుకునేందుకు ఈ నెయ్యిని సైతం కల్తీ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. కాబట్టి మన కొనే నెయ్యి నిజమైనదో, లేదా కల్తీదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారిక సూచనల మేరకు మనం…
