తాజావార్తలు

ఖాకీ డ్రెస్ ఒంటి మీద ఉందని రెచ్చిపోయిన కానిస్టేబుల్.. వృద్ధుడిపై విచక్షణారహిత దాడి..!

వికారాబాద్: వృద్ధుడిపై ఓ పోలీసులు కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వికారాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. ఎంఐజీ కాలనీలో సైకిల్ నిలిపిన విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. తనపై కానిస్టేబుల్ దాడి చేశాడంటూ బాధిత వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంఐజీ కాలనీలో నివసించే అనంతయ్య అనే వృద్ధుడు ఓ ఇంటి ముందు తన సైకిల్‌ను నిలిపాడు. అయితే ఆ ఇంటి ముందు నుంచి సైకిల్‌ను…

Read More

ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా నియామకం

హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో క్యూర్ పరిధికి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో వెల్లడించారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ట్రాన్స్‌జెండర్‌ సమాజానికి కూడా మున్సిపల్ పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో…

Read More

రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట!

Daily Diya Rituals Telugu: హిందూ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, దీపం వెలుగు సానుకూల శక్తికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక. పూజా స్థలంలో నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన, సానుకూల వాతావరణం నెలకొంటుందని, దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అందుకే కొందరు భక్తులు వారంలోని రోజును బట్టి ఆయా దేవతలకు ఇష్టమైనవిగా భావించే పదార్థాలను దీపంలో వేసి…

Read More

సికింద్రాబాద్ – విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్.. 3 గంటలు ఆలస్యంగా బయల్దేరనున్న రైలు

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. శుక్రవారం సెప్టెంబర్ 11, 2026 రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైలు వేళల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు ముఖ్య గమనిక సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 20834 నెంబర్ గల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా మధ్యాహ్నం 03:00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉండగా…..

Read More

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఈ రూట్లో వెళ్లేవారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. ప్రారంభం ఎప్పుడంటే..?

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల వాహనదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను వేగవంతం చేసి, 2027 జూన్‌ నాటికి ఫ్లైఓవర్‌ను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉప్పల్‌–నారపల్లి మార్గంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు వరంగల్‌ వైపు వెళ్లే వాహనాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే…

Read More

Bill Payments: వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్, గ్యాస్ బిల్లు చెల్లించడం ఎలా..? ఒక్క క్లిక్‌తో క్షణాల్లోనే పేమెంట్..

ఇప్పటివరకు వాట్సప్ అంటే కేవలం ఛాటింగ్ చేసుకోవడం, ఫైల్స్, వీడియోలు పంపించుకోవడమే కాదు.. ఇక నుంచి మీరు ఇదే సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో యుటిలిటీ బిల్లలను కూడా చెల్లించవచ్చు. ఇప్పటికే వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే సౌకర్యం అందుబాటులో ఉండగా.. ఇక నుంచి కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులు లాంటివి కూడా సలువుగా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు చెల్లించడం లాంటివి కూడా నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు వాట్సప్ తాజాగా బిల్లుల…

Read More

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పోలీస్‌ శాఖలో 1871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌!

ఢిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF)లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష-2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఢిల్లీ పోలీసుతో పాటు BSF, CISF, CRPF, ITBP, SSB వంటి కేంద్ర సాయుధ బలగాల్లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద CAPF పరిధిలోని మొత్తం 1871 BSF, CISF, CRPF, ITBP, SSB విభాగాల్లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ…

Read More

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు!

దేశవ్యాప్తంగా ఉన్న యునైటెడ్‌ ఇండియా ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (UIIC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త అందించింది. ఈ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 225 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 200 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–జనరలిస్టు పోస్టులు, 25 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–హిందీ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం…

Read More

Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచిన చంపిన వ్యక్తి!

హైదరాబాద్‌లో దారుణ హత్య వెలుగు చూసింది. రాయదుర్గం పీఎస్‌ పరిధిలో ఓ వ్యక్తని దారుణంగా కత్తులతో పోడిచి హత్య చేశారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంజయ్యనగర్‌లోని హరిహర మెన్‌ హాస్టల్‌లో శశిధర్‌(43) వంటమనిషిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శివబాలాజీ హాస్టల్‌లో ప్రమోద్‌ అనే వ్యక్తి చాఫ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఇద్దరి…

Read More

SSC నుంచి వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు.. 6,155 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్ 11: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇది మంచి అవకాశంగా మారింది. జూనియర్‌ ఇంజినీర్‌, కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (CHSL), దిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ తదితర విభాగాల్లో మొత్తం 6,155 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు SSC జూనియర్‌ ఇంజినీర్‌ (JE) పరీక్ష-2026…

Read More