
బుల్లితెర ఆడియెన్స్ ఫెవరేట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆరో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. ఇక పోతే మొదటివారం చైత్ర ,చరణ్ ఎలిమినేట్ అయ్యారు.. కానీ చరణ్ కి మరో అవకాశం లభించింది. రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం ఎలిమినేషన్ లేకపోయినా వైల్డ్ కార్డు ద్వారా అదే వారం హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ కాగా, ఐదవ వారం చరణ్, అపూర్వ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. టెంపర్ వంశీ, రాంప్రసాద్, అమన్, శాలిని, వర్షిని, రోహిత్ ఇలా మొత్తం 6 మంది నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ను పరిశీలిస్తే.. వర్షిని , శాలిని డేంజర్ జోన్ లో ఉన్నారు. వంశీ కూడా తక్కువ ఓట్లు పడినప్పటికీ తాజాగా జరిగిన ఎపిసోడ్ తో అతను సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వర్షిణీ, శాలినీలలో ఎవరో ఒకరు ఈవారం ఎలిమినేట్ అవ్వనున్నారు. అయితే ఇప్పుడిదే ఎలిమినేషన్ విషయంపై త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
తాజా ఎపిసోడ్ లో భాగంగా.. వర్షిణి త్రిగుణ్ వద్దకు వచ్చి.. ‘అందరూ నేను ఈ వారం ఎలిమినేట్ అవుతాను అంటున్నారు. ఆల్రెడీ ఈ వారం వంశీకి సింపతి ఎపిసోడ్ పడింది. కాబట్టి నేను ఎలిమినేట్ అవుతాను’ అంటూ బాధపడుతూ చెప్పింది. దీంతో త్రిగుణ్.. ‘ఈ వారం వంశీకి సింపతి ఎపిసోడ్ పడింది నిజమే కానీ ఈవారం నువ్వు ఎలిమినేట్ అవ్వవు. నిన్ను సేవ్ చేసి శాలినినీ బయటకు పంపించేస్తారు. ముఖ్యంగా శాలిని హౌస్ లో ఎక్కువగా అరుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు రోహిత్ కి నీతూ వచ్చింది. శాలినీని పంపించేస్తే.. గేమ్ బెటర్ అవుతుంది. గొడవలు అగుతాయి’ అని చెబుతాడు. అయినా ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతాను అని వర్షిణీ అంటే త్రిగుణ్ ఆమె ముఖాన్ని అద్దంలో చూపిస్తూ.. ‘ లేదు ఒకసారి ఇలా చూడు.. ఈ అందం లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది? ఇంత గ్లామర్ లేకుండా ఈ ఇంట్లో మేము ఎలా ఉండగలుగుతాం ? అంటూ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన విజువల్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి త్రిగుణ్ చెప్పినట్లు నిజంగానే షాలినీ ఎలిమినేట్ అవుతుందా? లేదా? పెద్దగా కంటెంట్ ఇవ్వని వర్షిణీ బయటకు వెళ్లిపోతుందా? అన్నది తెలియాలంటే ఆదివారం ఎసిపోడ్ దాకా వేచి చూడాల్సిందే.
వైరల్ అవుతోన్న త్రిగుణ్, వర్షిణీల వీడియో ఇదిగో..
Mabbu gadu chusthey Sachipothadu Emo #Thrigun Bhai…
#BiggBossTelugu10 https://t.co/DBLJg5VH3N— ╹☆ 𝕂𝖗𝖎𝖘𝖍 ☆╹ (@Krishna_Tarak09) October 15, 2026
Varshini:- Ee week nenu eliminate avuthanu ani andaru predict chesaru antundi
and then see how Thrigun is trying to make her feel confident , dancing to cheer her up
What a genuinely person he is
#Biggbosstelugu10 #Thrigun https://t.co/qNCETpUK0g
— Neeraj
(@neeraj_yh) October 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






(@neeraj_yh) October 15, 2026