Raghu Babu : నాలుగు సినిమాలు లేక డిప్రెషన్లో ఉన్నా.. కానీ.. ఆ మూవీతో లైఫ్ మారిపోయింది.. నటుడు రఘుబాబు..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు రఘుబాబు తనదైన హాస్యంతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని, తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఆది’ (2002) సినిమా విశేషాలను, ఆ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్‌తో తనకున్న పరిచయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రఘుబాబు మాట్లాడుతూ, ‘ఆది’ సినిమా ఆఫర్ వచ్చే సమయానికి తాను తీవ్రమైన నిరాశలో (ఫ్రస్ట్రేషన్)…
