కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత నాలుగు రోజుల నుండి ప్రతి రోజు గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మొదట వారం రోజుల క్రితం ఎయిమ్స్‌లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరుకు చెందిన ఇద్దరూ మహిళలకు కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ కాగా.. గత నాలుగేళ్ల నుండి ఆమె నవులూరులోనే నివసిస్తుంది. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో.. వీరిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ రెండు కేసులతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మహిళకు కరోనా సోకింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఆమెను ఎయిమ్స్ లోనే ఉంచి చికిత్స అందించారు. ఈ మూడు కేసులతో పాటు మరో రెండు కేసులు నిన్న నమోదయ్యాయి. దుగ్గిరాల, చినకాకానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. వీరికి కూడా చికిత్స అందించి హోం ఐసోలేషన్ ఉండాలని సూచించారు.
ఐదు పాజిటివ్ కేసులు
ఎయిమ్స్‌లో మొత్తం ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిజిహెచ్లోనూ మరొక పాజిటివ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు జిజిహెచ్ సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ చెప్పారు. ప్రతి రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జిజిహెచ్ లో ప్రత్యేక వార్డుతో పాటు ప్రత్యేక ఓపి కూడా ఏర్పాటు చేశారు. అటు ఎయిమ్స్ లోనూ ప్రత్యేక జ్వరాల వార్డును ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. శానిటైజర్ ఉపయోగిస్తూ మాస్క్ లు ధరించాలన్నారు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అయితే జాగ్రత్తలు పాటించాలంటున్నారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సరైన సమయంలో చికిత్స పొందుతూ వైద్యుల సూచనలు పాటించాలంటున్నారు. ఇక వైద్యాధికారులు
కరోనా లక్షణాలు ఇవే..
జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు. ఈ లక్షణాలో మీలో కనిపిస్తే జాగ్రత్త పడండి.
