తాజావార్తలు

Ramya Krishna: మేం విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం..అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ

రమ్యకృష్ణ.. తెలుగు జనానికి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార నేటి తరానికి కూడా శివగామిగా బాగా తెలుసు. ఇటీవలే రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ 2 సినిమాలో ఓ కీలక పాత్రలోనూ ఆకట్టుకున్నారీ అందాల తార. సినిమాలు, సీరియల్స్, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు రమ్యకృష్ణ. హీరోయిన్ గా బిజీగా…

Read Full News

ప్రేమ పేరుతో పాక్ ఉగ్ర ఉచ్చు.. రైల్వే ట్రాక్ పేలుడు కేసులో సంచలనం!

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ప్రేమ, డబ్బు ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా యువతులను, ముఖ్యంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్థాన్ ఏజెంట్ల కుట్ర బయటపడింది. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వారిని ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ రైల్వే ట్రాక్ పేలుడు ఘటనలో ఇద్దరి అరెస్టుతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా పరిచయం…..

Read Full News

ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?

ఐపీఎల్ మ్యాచ్‌లలో కెమెరా కళ్లు ఎప్పుడూ వెతికే కావ్య పాప..తన BGMలతో థియేటర్లను ఊపేసే అనిరుధ్‌! ఈ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. తమ మధ్య పుట్టిన ప్రేమను మూడు ముళ్ల బంధంతో ముందుకు తీసుకెళ్లారు. తమ మధ్య ప్రేమ పుట్టిన గ్రీస్‌ లోనే చాలా గ్రాండ్‌ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి ఆస్తుల మధ్య ఓ ఫన్నీ కంపారిజన్ ఇప్పుడు కోలీవుడ్‌లో…

Read Full News

Mohit Ulva: పాక్‌ను చిత్తు చేసి జాక్‌పాట్ పట్టేసిన మోహిత్ ఉల్వా.. ఒక్క రాత్రిలో..!

Mohit Ulva 49 Not Out: క్రికెట్‌లో కెరీర్‌ను మార్చేయడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఒక్క బంతి చాలు. సౌరాష్ట్ర కుర్రాడు మోహిత్ ఉల్వా విషయంలో అదే జరిగింది. శనివారం రాత్రి దాకా అతడు అండర్-19 కుర్రాడు మాత్రమే. ఆదివారం ఉదయానికి సీనియర్ క్రికెట్‌కు ఎంపికైన ఫ్యూచర్ స్టార్ అయ్యాడు. పాకిస్థాన్‌తో అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత్‌కు ఛాంపియన్‌షిప్ అందించిన గంటల వ్యవధిలోనే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (SCA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉల్వాను…

Read Full News

ఎన్టీఆర్‌కే పోటీ ఇచ్చిన హీరో.. చివరకు ఆస్తులన్నీ పోగొట్టుకొని ఒక చిన్న అద్దె ఇంట్లో జీవించాడు

తెలుగు చలనచిత్ర సీమలో “కత్తి కాంతారావు”గా ప్రసిద్ధి చెందిన కాంతారావు, అద్భుతమైన నటుడిగా, వందలాది చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వంటి అగ్రశ్రేణి నటులతో పోల్చదగిన మూడవ హీరోగా ఆయన వెలుగొందారు. ప్రత్యేకించి, బి. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన జానపద చిత్రాలు ఆయనకు “కత్తి కాంతారావు” అనే బిరుదును తెచ్చిపెట్టాయి. రామారావు గారు అందుబాటులో లేని…

Read Full News

షుగర్ ఉన్నవారికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. రాగి-మెంతులతో ఇలా చేసుకోండి.. ఆరోగ్యకరమైన టిఫిన్ రెడీ!

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉండటం చాలా ముఖ్యం. సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే, అనియంత్రిత బ్లడ్ షుగర్ కారణంగా తీవ్రమైన శారీరక అలసట, నీరసం, కాళ్ల పాదాలలో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ నిత్య ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిఫారసు చేస్తున్నారు. అదే మొలకెత్తిన రాగి, మెంతులతో తయారు చేసే ప్రత్యేక అల్పాహారం! తయారీకి కావలసిన పదార్థాలు: రాగులు…

Read Full News

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన!

తుఫాన్ ఫలితంగా, గురువారం, శుక్రవారం ఉత్తర ఆంధ్రలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తాంధ్రలో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాను.

Read Full News

ఆదివారం సూర్యారాధన.. ఏ దిశలో కూర్చుని పూజించాలి? అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఏ మంత్రం జపించాలి?

Sunday Surya Puja Telugu: హిందూ మతంలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. సూర్యుడిని సమస్త జీవరాశికి జీవశక్తిని, కాంతిని ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. అంతేకాదు, ఆత్మవిశ్వాసం, గౌరవం, కీర్తి, నాయకత్వ లక్షణాలకు కూడా సూర్యుడు ప్రతీకగా నిలుస్తాడు. అందుకే ఆదివారం సూర్య భగవానుడిని పూజించడం, సూర్యోదయ సమయంలో అర్ఘ్యం సమర్పించడం ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. కొందరు ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. అయితే సూర్యారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం శుభప్రదమని…

Read Full News

బలగం సినిమా ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు దిల్ రాజు చెప్పిన మాటకు షాక్ అయ్యా.!

బలగం చిత్ర ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు జరిగిన సరదా సంఘటనను కావ్య పంచుకున్నారు. దిల్‌రాజ్ కార్యాలయానికి సాధారణ జీన్స్, టీ-షర్ట్‌తో వెళ్ళినప్పుడు, దర్శకుడు వేణు “ఇలా కాదు, కుర్తీ వేసుకుని, దుపట్టాతో ఊర్లో అమ్మాయిలా రావాలి” అని చెప్పారంట. తిరిగి ఇంటికి వెళ్లి ఆయన సూచనల మేరకు సిద్ధమై వెళ్ళినప్పుడు కూడా, “ఇప్పుడు కొంచెం నా క్యారెక్టర్ లాగా ఉన్నావ్” అని వేణు అన్నారని ఆమె తెలిపారు. తాను సాధారణంగా మొదటిసారి దర్శకులను కలిసినప్పుడు మేకప్ వేసుకోనని, దర్శకుడు…

Read Full News

Telangana: వరుస ప్రమాదాలు , వివాదాలు.. ఆదిలాబాద్ రిమ్స్ డైరక్టర్ పై వేటు!

వరుస ప్రమాదాలు , వివాదాలు, ఆరోపణలు, గాలిలో కలిసిన నవజాత శిశువులు.. వరుస ఘటనలతో ఆదిలాబాద్ రిమ్స్ అభాసుపాలైంది. పసికందుల నుంచి యువకుల వరకు ప్రాణాలు కోల్పోయినా.. ఏకంగా పట్టపగలే ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోని వెంటిలేటర్లు చోరీకి గురైన రిమ్స్ యాజమాన్యం మొద్దు నిద్ర వీడలేదు. కింది స్థాయి సిబ్బంది నుండి రిమ్స్ డైరక్టర్ వరకు అందరిది ఒకటే తీరు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం. భద్రత డొల్లా.. అన్నీ కలిసి రిమ్స్ లో కొండంత శని…

Read Full News