Raptadu Victim: రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన మంత్రి లోకేష్
అనంతపురం జిల్లాలో రాప్తాడు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలిక స్పీడ్‌గా కోలుకుంటోంది. హేమంత్ దాడిలో గాయపడిన రాప్తాడు పదవ తరగతి చిన్నారి చాలా వేగంగా కోలుకుంటోందన్నారు మంత్రి నారా లోకేష్. ఆ చిన్నారి అద్భుతమైన పోరాట పటిమను కనబరుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వెంటిలేటర్ సాయం లేకుండానే ఆ చిన్నారి గాలి పీల్చగలుగుతోంది….
