తాజావార్తలు

Cinema : హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇదే..

1972 అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాపం పసివాడు చిత్రం అప్పటివరకు తెలుగులో వచ్చిన సినిమాలకు భిన్నంగా నిలిచి ఒక అద్భుతంగా కీర్తించబడింది. ప్రముఖ రచయిత, దర్శకులు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనంగా నిలిచింది. ఒకే ఒక్కడు ప్రాణాలతో మిగిలిన ఆరేళ్ల పసివాడు, అతడితో పాటు ఓ కుక్క పిల్ల ఎడారిలో సాగించిన అన్వేషణ, వారికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రం…

Read Full News

Dream Meaning: కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

Losing Your Way in a Dream Meaning Telugu: కలల ప్రపంచం ఎంతో ఆసక్తికరమైనది, రహస్యమైనది. కొన్నిసార్లు మనం అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నట్లు కలలు కంటాం. మరికొన్నిసార్లు మనకు తెలియని మార్గాల్లో ప్రయాణిస్తూ, ఎటు వెళ్లాలో అర్థంకాక దారి వెతుక్కుంటూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా గమ్యాన్ని చేరుకోలేకపోతున్నట్లు కూడా కలలు రావచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వాటి వెనుక ఏదైనా అర్థం ఉందా? భవిష్యత్తుకు సంబంధించిన సంకేతమా? అనే సందేహాలు కలగడం సహజం. స్వప్న శాస్త్రానికి…

Read Full News

Skin Care Secrets: 56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ వాడే ఆ ఇంటి చిట్కా ఏమిటో తెలుసా?

చర్మ సంరక్షణతో పాటు బరువు తగ్గిన విధానం, ఆహారపు అలవాట్ల గురించి కూడా ఖుష్బూ గతంలో మాట్లాడారు. ఐదేళ్ల వ్యవధిలో 40 కిలోలకుపైగా బరువు తగ్గిన ఆమె, ఈ మార్పు కోసం క్రాష్ డైట్లు లేదా గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం కాకుండా దీర్ఘకాలిక జీవనశైలి మార్పులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆకలి లేకపోయినా తరచూ తినడం కంటే నిజంగా ఆకలి వేసినప్పుడే తినడం, చిన్న ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లను కూడా పాటిస్తున్నట్లు…

Read Full News

‘ఆ సమయంలో బాగా ఏడ్చాను.. నా కెరీర్‌లో అత్యంత చీకటి రోజులవే..’: రోహిత్ శర్మ

Rohit Sharma Emotional: రోహిత్ శర్మ (Rohit Sharma) భారత క్రికెట్ చరిత్రలో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. అయితే అతడి కెరీర్‌లో ఒక దశ మాత్రం తీవ్ర ఇబ్బందులతో నిండిపోయింది. తాజాగా ఆ కఠిన సమయాన్ని రోహిత్ గుర్తుచేసుకుంటూ కీలక విషయాలను వెల్లడించాడు. కెరీర్‌లో అత్యంత కష్టమైన సమయం ఏదంటే..? విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ…

Read Full News

Maheshwari: గులాబీ భామ మహేశ్వరి గుర్తుందా.. ? ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్..

‏90ల నాటి కుర్రాళ్ల కలల రాణి అంటే గుర్తొచ్చే కథానాయికలు చాలా మంది ఉన్నారు. అందులో మహేశ్వరీ ఒకరు. తెలుగులో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్. ‘గులాబీ’, ‘పెళ్లి’ చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మను సినీ ప్రియులు అంత తేలికగా మరచిపోలేరు. తన అమాయకమైన చూపులు, సహజసిద్ధమైన నటనతో ఆనాటి యూత్‌ను కట్టిపడేసిన ఈ భామ, ‘నీకోసం’ సినిమాకు గాను నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. కేవలం సినిమాలే కాకుండా అటు బుల్లితెరపై…

Read Full News

IND vs WI: ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా తుక్కుతుక్కుగా దంచేశాడయ్యా..!

West Indies Failed Plan B Against Abhishek Sharma Dominance: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. అయితే అభిషేక్‌ను కట్టడి చేసేందుకు విండీస్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగినట్లు మ్యాచ్ అనంతరం ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోర్‌లో అభిషేక్ విధ్వంసం…..

Read Full News

Business Ideas: ఈ వ్యాపారం మొదలుపెడితే రోజూ మీకు డబ్బులే.. కస్టమర్ల కోసం ఎదురుచూడాల్సిన పనే లేదు..

స్వయం ఉపాధి పొందేందుకు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. దీంతో ఏ వ్యాపారం మొదలుపెట్టాలా? అని చాలామంది మదన పడుతుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం కోసం వెతుకుతుంటారు. ఇందుకోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీవారికి అడగడం, గూగుల్‌లో సెర్చ్ చేయడం లాంటివి  చేస్తూ ఉంటారు. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారిని అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ కస్టమర్లు, అధిక ఆదాయం వచ్చే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి అనేక అవకాశాలు ఉన్నాయి….

Read Full News

Railway Track: ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే?

రైల్వే ట్రాక్ మధ్యలో, చుట్టుపక్కల వేసే ఈ రాళ్లను 'ట్రాక్ బ్యాలస్ట్' అంటారు. ఇవి పట్టాలను సరైన దూరంలో స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సాధారణంగా పగులగొట్టిన గట్టి రాళ్లతో తయారు చేస్తారు. ఇండియన్ రైల్వేస్ (RDSO) ప్రకారం.. బ్యాలస్ట్ స్లీపర్లకు సమతల పడకను అందించి, వాటిని కదలకుండా స్థిరంగా పట్టి ఉంచుతుంది. రైలు చక్రాల నుంచి వచ్చే భారీ భారాన్ని నేలపై విస్తృత ప్రాంతానికి సమానంగా పంచుతుంది. ఈ రాళ్లు నునుపుగా కాకుండా…

Read Full News

ప్రాణాలు పణంగా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు.. షాకింగ్ వీడియో షేర్ చేసిన కోన వెంకట్

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్ ఇటీవలే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జానకీరామ్ దర్శకత్వం వహించారు. మౌత్ టాక్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన…

Read Full News

అంకెల్లో మాయం అవుతున్న నిరుద్యోగులు.. నిరుద్యోగిత రేటు అంకెల వెనుక అసలు నిజాలివే..

ఒక పాతికేళ్ల యువకుడు రెండేళ్లుగా ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా తిరస్కరణే ఎదురవడంతో విసిగిపోయి, గతేడాది నుంచి ఉద్యోగాల కోసం వెతకడమే మానేశాడు. ఈరోజు అతడిని “నువ్వు నిరుద్యోగివా?” అని అడిగితే.. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం అతడు ‘నిరుద్యోగి’ కాడు! ఇది వినడానికి విచిత్రంగా అనిపించినప్పటికీ, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగాన్ని కొలిచే ప్రామాణిక పద్ధతి ఇదే. అసలు ఈ లెక్కలు ఎలా వేస్తారు? అధికారిక శాతాల వెనుక దాగి ఉన్న అసలు నిరుద్యోగుల సంఖ్య…

Read Full News