తాజావార్తలు

అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం

అరటి నారతో ఇక్కత్ వస్త్రం..సాధారణంగా అరటి పంట తర్వాత పనికిరాదని భావించే అరటి మొక్క నుంచి లభించే నారను వస్త్ర తయారీలో వినియోగించాలనే ఆలోచనతో కొత్త ప్రయత్నానికి భోగ బాలయ్య శ్రీకారం చుట్టారు. సాధారణంగా కాటన్, సిల్క్ వస్త్రాలను నేయడానికి కుడి, ఎడమ ఉండే రెండు పెడల్స్ తొక్కుతూ మగ్గంపై వస్త్రాన్ని వస్త్రాన్ని నేస్తారు. కానీ, ఈ విధానంలో మాత్రం ప్రత్యేకంగా నాలుగు పెడల్స్, నాలుగు అచ్చులను వినియోగించారు. అడ్డం దారం (వెస్ట్) మాత్రం అరటి చెట్టు…

Read Full News

మీ సీక్రెట్ మాటలు మీ ఫోన్‌కు ఎలా తెలుస్తున్నాయి..? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి..

పండుగలు వస్తున్నాయంటే చాలు.. ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చుని ఏమేం కొనాలి, ఎలాంటి బట్టలు లేదా బూట్లు ఎంచుకోవాలనే చర్చలు మొదలవుతాయి. అయితే ఆ చర్చ ముగిసి, తీరిగ్గా కూర్చుని ఫోన్ తెరిచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుండగానే సరిగ్గా కొద్దిసేపటి క్రితం మాట్లాడిన అవే బ్రాండ్లు, మోడల్స్ ప్రత్యక్షమవుతాయి. కింద Buy Now బటన్‌తో సహా ఆఫర్లు దర్శనమిస్తాయి. దీంతో చాలామందిలో ఒక బలమైన అనుమానం మొదలవుతోంది. మన ఫోన్ లేదా ఇంట్లోని…

Read Full News

ఐదేళ్ల ప్రేమ.. ఆపై పెళ్లి.. తర్వాత నెలకే ఒకరి తర్వాత మరొకరి ఆత్మహత్య.. అసలు ఏమైందంటే..?

ఐదేళ్లు ప్రేమించుకుని.. పెళ్లైన నెలరోజులకే విభేదాల కారణంగా భార్యభర్తలు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రుపాలెంకు చెందిన మహేష్ (25) విజయవాడలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడే అతనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం బెల్లంకొండవారిపాలెంకు చెందిన వెంకటరమణ (23) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లు ప్రేమగా మారడంతో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ బంధం…

Read Full News

టీమిండియాలోకి దూసుకొస్తోన్న తుఫాన్.. అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం..!

Anvay Dravid: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, “ది వాల్” గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. యువ క్రికెటర్లందరి దృష్టిని ఆకర్షిస్తూ, తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవల వినూ మన్కడ్ ట్రోఫీ అండర్ 19 వన్డే టోర్నమెంట్ లో కర్ణాటక తరపున ఆడుతున్న 17 ఏళ్ల అన్వయ్, తన అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో అన్వయ్ ప్రదర్శన ప్రత్యేకంగా…

Read Full News

అందానికి, జుట్టుకు సూపర్‌ఫుడ్.. ఆడవారి ఆరోగ్యానికి ఈ గింజలు వరం లాంటివి..

ముఖ్యంగా, అవిసె గింజలు బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. నెలసరి సమస్యలను తగ్గించి, పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా దోహదపడతాయి.

Read Full News

కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసే బలమైన ఫుడ్.. ప్రపంచం మొత్తం దీనివెంటే

నేటి ఆధునిక ప్రపంచంలో చిత్ర విచిత్రమైన రోగాలు, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి, తీసుకునే ఆహారం విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒకప్పుడు విస్మరించబడిన లేదా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బలవర్ధకమైన సంప్రదాయ ఆహార పదార్థాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో జొన్న రొట్టె అనూహ్యమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇంతకుముందు కేవలం గోధుమ చపాతీలను మాత్రమే తినేవారు సైతం ఇప్పుడు…

Read Full News

” రౌడీ ” పేరు తప్పితే అన్నీ ఓకే..ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊర‌ట

హీరో విజయ్ దేవరకొండకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, గొంతు, ఇతర వ్యక్తిగత హక్కులను అనధికారికంగా ఇతరులు వాడకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్, ఫేస్ మార్ఫింగ్ టెక్నాలజీలను ఉపయోగించి ఆయనను అశ్లీల లేదా అసభ్యకర రీతిలో చిత్రీకరిస్తున్న కంటెంట్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది.మెటా, గూగుల్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలు గుర్తించిన అక్రమ కంటెంట్, వీడియోలు, రీల్స్, పోస్టులు, అకౌంట్లను…

Read Full News

5 కిలోమీటర్ల జర్నీకి అరగంట.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఏం జరుగుతోంది..

హైదరాబాద్ నుంచి దసరా పండుగ కోసం నగరవాసులు ఊళ్లబాట పట్టడంతో.. హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిటకిటలాడుతోంది. వాస్తవానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉండే.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి దేశంలోనే అత్యధిక వాహన రద్దీ కలిగిన హైవేగా పేరుంది. ఈ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతూనే ఉంది. ప్రమాదాల నివారణకు హైవేపై చేపట్టిన అండర్ పాస్‌ల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పేలా సాగుతుండడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఈ…

Read Full News

అమ్మలగన్న అమ్మకు విశేష అర్చనలు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శక్తి స్వరూపిణి దుర్గ మాతను ఆరాధిస్తూ దేవీ శరన్ననవరాత్రి వేడుకలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు. ప్రతి ఏడాది ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నవరాత్రులనే శరన్నవరాత్రులని, దసరా నవరాత్రులని, శారదీయ శరన్నవరాత్రులని, దుర్గానవరాత్రులని కూడా పిలుచుకుంటారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి ఆరాధిస్తున్నారు….

Read Full News

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. మతిపోగొట్టేస్తున్న మారుతి కారు

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు మారుతి సుజుకి సిద్ధమవుతున్న నేపథ్యంలో eWX కాన్సెప్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. టాల్‌బాయ్‌ డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌, సుమారు 230 నుంచి 300 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్న రేంజ్‌ ఈ కారుపై అంచనాలను పెంచుతున్నాయి. అయితే ధర, బ్యాటరీ, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాక్సీ డిజైన్‌.. Maruti Suzuki eWX కాన్సెప్ట్‌ కారులో ప్రధానంగా ఆకట్టుకునేది దీని బాక్సీ డిజైన్‌. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో…

Read Full News