తాజావార్తలు

Business Ideas: ఈ వ్యాపారం మొదలుపెడితే రోజూ మీకు డబ్బులే.. కస్టమర్ల కోసం ఎదురుచూడాల్సిన పనే లేదు..


స్వయం ఉపాధి పొందేందుకు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. దీంతో ఏ వ్యాపారం మొదలుపెట్టాలా? అని చాలామంది మదన పడుతుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం కోసం వెతుకుతుంటారు. ఇందుకోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీవారికి అడగడం, గూగుల్‌లో సెర్చ్ చేయడం లాంటివి  చేస్తూ ఉంటారు. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారిని అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ కస్టమర్లు, అధిక ఆదాయం వచ్చే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి అనేక అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో ఇలాంటి వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అందులో కూరగాయల వ్యాపారం ఒకటిగా చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్జిన్ ఇందులో పొందే ఛాన్స్ ఉంది. కూరగాయలు ప్రతీ ఇంట్లో రోజూ అవసరం కాబట్టి కస్టమర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది.  సూపర్ మార్కెట్లు వచ్చినా ఇంటి సమీపంలోని షాపులో కూరగాయలు ఎక్కువమంది కొంటూ ఉంటారు.  దీంతో ఈ వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

కూరగాయల వ్యాపారం ఎలా మొదలుపెట్టాలి..?

తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు బల్క్‌లో కూరగాయలు తక్కువ ధరకు లభిస్తాయి. మార్కెట్ యార్డులు, రైత బజార్ల నుంచి తక్కువ ధరకు మీరు బల్క్‌లో కూరగాయలు తెచ్చుకోవాలి. మీరు వీటిని  ఎక్కువ మార్జిన్‌కు విక్రయించి లాభం పొందవచ్చు. ఈ వ్యాపారంలో మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వ్యాపారులు రూ.20కి కేజీ ఆలుగడ్డలు కొని రూ.40కి అమ్మి డబుల్ ప్రాఫిట్ పొందుతారు. అధిక మార్జిన్‌తో విక్రయిస్తే అధిక లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అపార్ట్‌మెంట్లు, జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాల్లో మీరు షాపు తెరవాలి. తాజా, నాణ్యమైన కూరగాయలను కస్టమర్లకు అందుబాటులో ఉంచాలి. దీని వల్ల మీ షాపుకు కస్టమర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అయితే కూరగాయలలో ఖచ్చితంగా డ్యామేజ్ లేదా పాడైనవి ఉంటాయి. కొన్నిసార్లు మీరు తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోవు. ఇలాంటివాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కస్టమర్‌లకు సరుకు తూకం వేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేయడం, కొన్ని డ్యామేజ్ కావడం వల్ల 100 కిలోల సరుకులో సుమారు 20 కిలోల వరకు నష్టం వస్తుంది. రూ.20కి కొన్న ఆలుగడ్డలను రూ.40కి అమ్మాలనుకున్నా.. మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. మీ దుకాణం మాత్రమే కాదు.. వందల దుకాణాలు ఉంటాయి. కస్టమర్లు నాణ్యతతో పాటు తక్కువ ధరను కోరుకుంటారు. ఇతర దుకాణాలతో పోటీ పడి కొన్నిసార్లు ధరలను తగ్గించాల్సి వస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ సరుకు పాడవకుండా ఉండేందుకు రేట్లను మరింత తగ్గించాల్సి రావచ్చు.  వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి విషయాలను ముందు తెలుసుకోవాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ఈ వాస్తవాలను అర్థం చేసుకోకపోతే నష్టపోవచ్చు. ఈ వ్యాపారంలో స్థిరమైన లాభాలు పొందాలంటే.. నష్టం లేకుండా అమ్మడం, పోటీని తట్టుకోవడం, సరైన స్థానాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *