తాజావార్తలు

Ranabaali Pre Release Event: రణబాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుంది.. విజయ్ దేవరకొండ..

రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయ్ దేవరకొండ ప్రసంగంతో ఓ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పండగ వాతావరణంలో అక్టోబర్ 16న రణబాలి విడుదలవుతుందని, తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “వస్తుంది సింగనమల బొబ్బిలి రణబాలి. రా నీ యెక్క!” అంటూ సినిమాపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని చాటారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ విజన్‌ను విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాల తర్వాత ఒక పెద్ద, రూరల్ మాస్…

Read Full News

Reliance: ధీరూభాయ్ అంబానీ నుంచి ముఖేష్ అంబానీ వరకు.. భారతదేశ అభివృద్ధిలో ‘రిలయన్స్‌’ చెరగని ముద్ర

గుజరాత్‌లోని చోర్వాడ్‌ అనే చిన్న గ్రామంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం 17 ఏళ్ల వయసులో యెమెన్‌లో పెట్రోల్ బంకులో పనికి చేరారాయన. అనంతరం ముంబైకి చేరుకుని చిన్న వ్యాపారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అపారమైన ఆశయం, కష్టపడే తత్వం, సాహసోపేత నిర్ణయాలు ధీరూభాయ్ అంబానీని పారిశ్రామిక దిగ్గజంగా నిలబెట్టాయి. 1977లో రిలయన్స్‌ పబ్లిక్ ఇష్యూ భారతీయ పెట్టుబడుల చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. సాధారణ ప్రజలు కూడా కంపెనీల అభివృద్ధిలో భాగస్వాములై,…

Read Full News

ఈ రాశుల వారికీ అంతా శుభమే.. ఇక తిరుగు ఉండదు..

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Read Full News

మీరు ఉగ్రవాది.. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో మహమ్మద్‌ యూనస్‌కు నిరసన సెగ..!

అక్టోబర్‌ 12, సోమవారం దోహా నుంచి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో యూనస్‌ న్యూయార్క్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు బంగ్లాదేశీ ప్రవాసులు ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నించారు. ‘మీరు ఉగ్రవాది. బంగ్లాదేశ్‌లో ప్రజలను చంపారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారో చెప్పండి’ అంటూ ఓ వ్యక్తి యూనస్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారనీ, రెండు లక్షల మందిని అరెస్టు చేశారని, వేలాది మంది పోలీసు సిబ్బంది మరణాలకు…

Read Full News

సూపర్‌మార్కెట్ల పై సైబర్‌ దాడి.. పాడైన ఆహారం, కోట్లలో నష్టం!

ఫ్రాన్స్‌లోని ఇంటర్‌మార్షే (Intermarché), కోఆపరేటివ్‌ యూ (Cooperative U), ఈ లెక్లెర్క్‌ (E.Leclerc), క్యారీఫోర్‌ (Carrefour), మోనోప్రి (Monoprix) సూపర్‌మార్కెట్లపై సైబర్‌ దాడి జరిగింది. హ్యాకర్లు దుకాణాల్లోని శీతలీకరణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని, ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను పెంచేసారు. ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ కు పెరగడంతో పాలు, మాంసం, తాజా ఆహార పదార్థాలతో పాటు ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన ఆహారం పాడైంది. ఇంటర్‌మార్షే నెట్టో (Netto) బ్రాండ్‌కు చెందిన కనీసం 300 దుకాణాలు దాడి…

Read Full News

Tragic Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా 10 మంది మృతి.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు

ragic Boat Accident: బిహార్‌లోని గంగానదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వైశాలి జిల్లాలోని రాఘోపూర్ ప్రాంతం సమీపంలో పడవ బోల్తా పడటంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. నదిలోని బలమైన ప్రవాహానికి అదుపుతప్పి పడవ బోల్తా పడటంతో అందులో ఉన్నవారందరూ లోతైన నీటిలో మునిగిపోయారు….

Read Full News

SBI Alert: ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త.. ఎస్‌బీఐ హెచ్చరిక.. అవేంటో తెలుసా..?

SBI Alert: సోషల్ మీడియా, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్‌లు లేదా ఈమెయిల్‌ల ద్వారా మీకు నెలకు 30% రాబడి ఇస్తామన్న ఆఫర్లు వస్తుంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆకర్షణీయమైన వాగ్దానాలు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన ఎస్‌బిఐ, మోసపూరిత పెట్టుబడి పథకాల గురించి పెట్టుబడిదారులను హెచ్చరించింది. త్వరితగతిన, అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపి సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని దోచుకోగలరని ఆ బ్యాంకు పేర్కొంది. అందువల్ల ఏదైనా…

Read Full News

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌.. ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు!

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. ఈ సందర్బంగా ఉత్సవ్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తమిళనాడు అభివృద్ధికి విజయ్‌ కృషి చేస్తున్నారని, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయం ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. రాష్ట్రాలు వేరైనా మా అభిమతం ఒక్కటేనని చంద్రబాబు పేర్కొన్నారు. కరువుకు శాశ్వత పరిష్కారం నదుల అనుంధానమేనని, అన్ని రాష్ట్రాలు…

Read Full News

Electric Blankets: ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!

Electric Blankets: వేసవిలో ఏసీ లేదా కూలర్ లేకుండా నిద్రపోవడం ఎంత కష్టమో, శీతాకాలంలో చల్లటి పడక కూడా నిద్రను సవాలుగా మారుస్తుంది. మరి శీతాకాలం కూడా ప్రారంభమైపోయింది. మీరు చల్లటి పడక సమస్యను వదిలించుకోవాలనుకుంటే, ఎలక్ట్రిక్ బ్లాంకెట్ సహాయపడుతుంది. మీరు ఎలక్ట్రిక్ బ్లాంకెట్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ముందుగా దాని గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం. దీన్ని ఎలా ఉపయోగించాలి? మీ పడకను వెచ్చగా ఉంచుకోవడానికి పడుకునే ముందు 15-20 నిమిషాల ముందు…

Read Full News

75 రోజుల విరామం తర్వాత పాపికొండల బోటింగ్.. భారీగా పర్యాటకుల తాకిడి

తూర్పు కనుమల నడుమ ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచే పాపికొండల ప్రయాణం పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఆకాశాన్ని తాకేలా కనిపించే పచ్చని కొండలు.. వాటి మధ్య నుంచి వయ్యారంగా సాగిపోయే గోదావరి నది.. నది ఒడ్డున కనిపించే పల్లె అందాలు.. వెరసి పాపికొండల విహారయాత్ర ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గోదావరి నదిపై బోటు ప్రయాణం చేయడం పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. పాపికొండల అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు దారి…

Read Full News