తాజావార్తలు

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్ట్!

గత సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమాన కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ హమామ్ అల్-హమ్మమి గొడ్డలితో దాడి చేసాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దర్యాప్తు కొనసాగుతుండగా, మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను కూడా దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మాల్దీవుల వార్తా సంస్థ ‘అధాదు’ తెలిపింది. గత శనివారం వారిని అరెస్ట్…

Read Full News

సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆమె సింహాల సఫారీకి వెళ్లగా, అక్కడ సింహాల వెంటే ఎంతో ధైర్యంగా నడుస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. సీతక్క ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని తెలంగాణ సంఘం అక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్కను ఆహ్వానించారు. అయితే సీతక్క ఈ పర్యటనను కేవలం వేడుకలకే పరిమితం…

Read Full News

మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!

చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్‌కు చెందిన వాంగ్ యింగ్ కి పక్షులను ఫొటోలు తీయడమంటే ఎంతో మక్కువ. ఇప్పటివరకు 1,200కు పైగా పక్షి జాతులను కెమెరాలో బంధించారు. అయితే, 2013లో ఉద్యోగ విరమణకు సిద్ధమవుతున్న సమయంలో ఆమెకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ వాంగ్ తనకు ఎంతో ఇష్టమైన పని పూర్తి చేయాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి పెంగ్విన్లను ఫొటోలు తీయాలని కలలు కన్నారు. క్యాన్సర్ నిర్ధారణతో…

Read Full News

దసరా రోజున సంబరాలుండవు.. రావణాసురుడికి ప్రత్యేక పూజలు..మనదేశంలోనే ఇదో విచిత్ర ఆచారం!

విజయదశమి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది దసరా సంబరాలు, రాముడి విజయం, దహనమయ్యే రావణుడి భారీ ఆకృతులు. దేశంలోని మూలమూలలా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరాను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఉన్న బిస్రఖ్ గ్రామంలో మాత్రం ఈ పండుగ రోజున వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పండుగ ఉత్సాహానికి బదులుగా శోకం కనిపిస్తుంది. రావణాసురుడి జన్మస్థలం బిస్రఖ్ పౌరాణిక కథనాలు, శివపురాణ ప్రశంసల ప్రకారం.. బిస్రఖ్…

Read Full News

The Odyssey OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’.. 15 వేల కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ది ఒడిస్సీ’. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది జూలై 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఒడిస్సీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలోనూ ఈ సినిమాకు రికార్డు వసూళ్లు వచ్చాయి….

Read Full News

రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త వెనుక అసలు నిజాలివే!

సోషల్ మీడియా యుగంలో ఏ వార్త ఎప్పుడు వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా విదేశీయులు, భారతీయుల మధ్య ప్రేమాయణాలు, పెళ్లిళ్ల గురించిన వార్తలకు ఇంటర్నెట్‌లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇటీవల బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ (ఇన్‌స్టాగ్రామ్ ఐడీ: నమిత్ భయ్) అనే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి జూలీ అనే మహిళ భారత్‌కు వచ్చిందని, నవంబర్‌లో వీరిద్దరి వివాహం జరగనుందని వార్తలు విపరీతంగా హల్‌చల్ చేశాయి. అయితే, ఈ వైరల్ వార్తపై క్షేత్రస్థాయిలో…

Read Full News

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఇంటికి అదనంగా రూ.72,000 ఆర్థిక సాయం!

Indiramma Housing Scheme: తెలంగాణలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం వెలువడింది. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (PMAY) రూరల్ పోర్టల్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా లబ్ధిదారులకు అదనపు ఆర్థిక భరోసా లభించనుంది. కేంద్ర నిధుల జోడింపు: పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద తెలంగాణకు…

Read Full News

బుధాదిత్య రాజయోగంతో వీరికి అదృష్టం.. సొంతిల్లు, వాహనం కొనుగోలు చేసే ఛాన్స్

బుధాదిత్య రాజయోగం 2026: జ్యోతిష్యశాస్త్రంలో బుధాదిత్య యోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో సంచరించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవం, అధికారానికి కారకుడిగా భావిస్తారు. బుధుడు తెలివితేటలు, మాటతీరు, వ్యాపారం, తార్కిక ఆలోచనలకు ప్రతీకగా చెబుతారు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి తప్పనిసరిగా అనుకూల ఫలితాలను అందిస్తుంది. 2026 అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో, అక్కడ ఇప్పటికే ఉన్న…

Read Full News

ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. ఏళ్ళ నుంచి వేధిస్తున్న కీళ్ల నొప్పులు చిటికెలో మాయమవుతాయ్

శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందకపోవడం, మధుమేహం, అధిక మందుల వాడకం, గాయాలు, మెదడు, వెన్నెముక సమస్యలు నరాల నొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా, విటమిన్ బి12 లోపం కండరాల నొప్పులు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, బరువు తగ్గడం, వికారం వంటి లక్షణాలకు కారణమవుతుంది. చేపలు, గుడ్లు, మాంసం, చీజ్, పెరుగు, పాలు వంటి బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్యలను అధిగమించవచ్చు. అంతేకాకుండా, ఎక్కువసేపు కూర్చోవడం, వేళకాని వేళల్లో భోజనం చేయడం,…

Read Full News

రోహిత్ శాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా కొనసాగుతుంది. మొన్నటి వరకు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్‌గా సాగిన ఈ గేమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో మరో మలుపు తిరిగింది. ఇక వైల్డ్ కార్డ్ వాళ్లు రావడం రావడమే శాలినీని టార్గెట్ చేశారు. అంతే కాకుండా కాస్త రోహిత్‌క‌ు సపోర్టుగా నిలిచినట్లు అనిపించింది. అంతే కాకుండా చాలా మంది రోహిత్‌తో క్లోజ్‌గా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ శాలీని మాత్రం అదంతా వారి గేమ్ ప్లాన్, నీ ఓట్స్ చీల్చడం…

Read Full News