తాజావార్తలు

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌.. ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు!


Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. ఈ సందర్బంగా ఉత్సవ్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తమిళనాడు అభివృద్ధికి విజయ్‌ కృషి చేస్తున్నారని, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయం ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. రాష్ట్రాలు వేరైనా మా అభిమతం ఒక్కటేనని చంద్రబాబు పేర్కొన్నారు. కరువుకు శాశ్వత పరిష్కారం నదుల అనుంధానమేనని, అన్ని రాష్ట్రాలు బాగుపడాలని, దేశం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గోదావరి- కావేరి అనుసంధానం జరుగుతుందని, నదుల అనుసంధానం మోదీతోనే సాధ్యమన్నారు.

అనంతరం తమిళనాడు సీఎం విజయ్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగించారు. విజయవాడ ప్రజలను కలవడం ఎంతో సంతోషకరంగా ఉందని, నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టమన్నారు. నదుల అనుసంధానంపై చర్చించేందుకే విజయవాడకు వచ్చానని విజయ్‌ చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *