నిరుద్యోగులకు గుడ్న్యూస్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 TGPSC ఉద్యోగ నోటిఫికేషన్లు!
హైదరాబాద్, ఆగస్ట్ 28: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన టీజీపీఎస్సీ.. తాజాగా మరో 15 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెలకు…
