తాజావార్తలు

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా సడెన్‌గా అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. ఒక్కసారిగా నర్సమ్మపై దాడికి దిగారు. నర్సమ్మ కళ్లలో…

Read More

Vande Bharat Express: తిరుపతికి మరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. శ్రీవారి భక్తులకు అదిరిపోయే సూపర్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుండటం భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు…

Read More

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని…..

Read More

దుర్గం చెరువులోకి మురుగునీటి చేరికకు చెక్‌.. శాశ్వత పరిష్కారానికి జలమండలి యాక్షన్ ప్లాన్!

నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు జలమండలి, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మురుగు ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించి, చెరువును కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు శాశ్వత కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం జలమండలి, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 4 మార్గాల ద్వారా చెరువులోకి మురుగు నీరు జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్…

Read More

Maremma Pre-Release Event : రవితేజగారు నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య : మాధవ్

మాధవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మారెమ్మ. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మాధవ్  మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత…

Read More

INDW vs PAKW: పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా భారత బౌలింగ్ ఎటాక్ ముందు పాక్ బ్యాటర్లు ఏ మాత్రం నిలువులేకపోయారు. ఓపెనర్లు మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా 10 పరుగులను టచ్ చేయలేదు. ముఖ్యంగా శ్రీచరణి, ప్రేమ రావత్ పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లతో తీన్మార్ ఆడించారు. ఈ మ్యాచ్‌లో టాస్…

Read More

ఉక్రెయిన్‌పై దాడులకు పుతిన్ బ్రేక్.. తెరపైకి అమెరికా దౌత్యం!

చర్చలు జరిగే సమయంలో ఎటువంటి దాడులు జరగకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక రోజు ముందే రష్యాకు ఒక ప్రతిపాదన పంపారు. తమ వైపు నుంచి ఎలాంటి వైమానిక దాడులు ఉండవని, రష్యా కూడా అదే విధంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. యుద్ధానికి తెరదించేందుకు వాస్తవమైన మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇందుకు అమెరికా దౌత్యవేత్తలు ఎలాంటి ప్రణాళికలతో వస్తున్నారో వేచి చూడాలని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడి తీవ్రమైన దాడులు చేసిన…

Read More

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’తో ఆకట్టుకున్న జోహెరీ…

Read More

టన్నుల కొద్దీ బంగారు నిల్వలు! అమెరికా నుంచి వెనక్కి తీసుకెళుతున్న యూరప్ దేశాలు

యూరప్ దేశాలు గతంలో తమ బంగారాన్ని అమెరికాలో భద్రపరుచుకునేవి. కానీ ఇప్పుడు వాటిని తమ దేశాలకు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. తాజా పరిణామాల్లో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ (డీ నెదర్లాండ్సీ బ్యాంక్) అమెరికా, కెనడాలో ఉన్న సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలించింది. గతంలో ఫ్రాన్స్ కూడా ఇలాగే వెనక్కి తెప్పించుకుంది. రాబోయే రోజుల్లో ఆర్థిక లేదా రాజకీయ సంక్షోభాలు ఎదురైతే సొంత దేశాల్లో బంగారం ఉండటం సురక్షితమని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. సురక్షితమైన ప్రదేశంగా నమ్మిన…

Read More

ఆ హీరోయిన్‌తో గొడవ జరిగింది..పెద్ద సినిమాను మధ్యలోనే ఆపేశా.. షాకింగ్ విషయం చెప్పిన ఎంఎస్ రాజు

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కడు, వర్షం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీలో తన అనుభవాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. యాంకర్ రోషన్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, తాను ఏ నటుడికి లేదా దర్శకుడికి చెడు చేయలేదని, తన వల్ల అందరికీ మంచి జరిగిందని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. తాను ఎవరి ఇంట్లో దొంగతనం చేయలేదని, ఎవరికీ అన్యాయం…

Read More