తాజావార్తలు

ఏంటి బాసూ రూ.1.14 కోట్ల ధర, 285 కి.మీ టాప్​ స్పీడ్ వెళ్లే కారు​! లగ్జరీ SUV పూర్తి వివరాలివే

Grecale Faceliftతో పాటు అప్‌డేట్ చేసిన GranTurismo, GranCabrio మోడళ్లను కూడా Maserati భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Grecaleలో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ Folgore వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 300HP నుంచి 530HP వరకు పవర్ అందించే పెట్రోల్ ఇంజిన్లు, 550HP పవర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉన్నాయి. కొత్త ఎక్ట్సీరియర్ డిజైన్, డిజిటల్ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్‌తో ఈ SUVని అప్‌డేట్ చేశారు. ఎలక్ట్రిక్…

Read Full News

సమోసాలు, మోమోస్ చట్నీలలో కృత్రిమ రంగులపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష!

వీధి వ్యాపారుల వద్ద దొరికే వేడి వేడి సమోసాలు, మోమోస్, చాట్ లేదా రోల్స్‌ను ప్రకాశవంతమైన ఎరుపు లేదా ఆకుపచ్చ చట్నీతో తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. స్ట్రీట్ ఫుడ్స్‌తో కలిపి ఇచ్చే చట్నీలలో హానికరమైన కృత్రిమ రసాయన రంగుల వాడకాన్ని యూపీ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FSDA) పూర్తిగా నిషేధించింది. సహజ పదార్థాలనే ఉపయోగించాలి!…

Read Full News

ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..!

Sanju Samson Poor Form: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకున్నప్పటికీ.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్‌సన్ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సిరీస్ తొలి మ్యాచ్‌లో 67 పరుగులతో అద్భుతమైన ఆరంభం ఇచ్చిన సామ్‌సన్.. ఆ తర్వాత బ్యాట్‌తో పూర్తిగా తడబడ్డాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సామ్‌సన్ మొత్తం 107 పరుగులు చేశాడు. ఇందులో తొలి మ్యాచ్‌లోనే 67 పరుగులు వచ్చాయి. మిగిలిన నాలుగు ఇన్నింగ్స్‌లను కలిపినా అతడి స్కోర్…

Read Full News

రాత్రి పడుకునే ముందు ముఖానికి ఏం రాసుకోవాలి?సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!

ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలంటే మంచి స్కిన్ కేర్ రొటిన్ అనుసరించడం చాలా అవసరం. ముఖ్యంగా పగటిపూట మన ముఖంపై పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట, మేకప్‌ను రాత్రి సమయంలో సరిగ్గా తొలగించడం చర్మ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అయితే, రాత్రిపూట చర్మాన్ని సంరక్షించుకోవడానికి చాలా రకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదని, కేవలం 3 సింపుల్ స్టెప్స్ పాటిస్తే సరిపోతుందని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గుర్వీన్ వడైచ్ గారేకర్ వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం. స్టెప్…

Read Full News

Telangana: బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు..

డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఈగల్ ఫోర్స్, పటాన్‌చెరు పోలీసులు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్ గ్రామంలోని గోవిందరావు డెయిరీ ఫామ్‌పై సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులతో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన నలుగురు వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.57 వేలుగా అంచనా…

Read Full News

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. మున్సిపల్ ఎన్నికల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం..!

కడప: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 మంది బూత్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎన్నికలు సజావుగా జరిగినట్లు ఎలా భావిస్తారని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడితే…

Read Full News

Rajeev Kanakala : విక్రమార్కుడు షూటింగ్‏లో అతడు నిజంగానే మెట్లపై నుంచి పడిపోయాడు.. తర్వాత ఏం జరిగిందంటే..

నటుడు రాజీవ్ కనకాల, పలు చిత్రాల షూటింగ్ అనుభవాలను, దర్శకులతో తనకున్న అనుబంధాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకులైన ఎస్.ఎస్. రాజమౌళి, పూరీ జగన్నాథ్, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడిల పనితీరు, వారి ప్రత్యేకమైన శైలుల గురించి ఆయన వివరించారు. కొంతమంది దర్శకులు నటీనటులకు స్వేచ్ఛనిస్తే, మరికొందరు తమకు ఏం కావాలో కచ్చితంగా రాబట్టుకుంటారని పేర్కొన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి గురించి మాట్లాడుతూ, ఆయనకు ప్రతి షాట్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని రాజీవ్ అన్నారు. “తనే…

Read Full News

Telangana: రాత్రికి రాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు

రాత్రికిరాత్రే చేనులోని చేతికొచ్చిన పత్తిని ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ శివారులో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లే.. బాధిత రైతు బ్రహ్మనంద రెడ్డికి మద్దికుంట గ్రామ శివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆయన ఎంతో ఆశతో పత్తి పంటను సాగు చేశారు. ఈ ఏడాది పత్తి పంట బాగా పండటంతో, ఇటీవల వచ్చిన దసరా పండుగ రోజున చేను వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. పంటను తీయడానికి అన్ని ఏర్పాట్లు…

Read Full News

Abhishek Sharma: టీమిండియా కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కానీ ఓ కండీషన్

Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీ20ల్లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అవుతాడా? అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై అభిషేక్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా స్పందించారు. అభిషేక్‌లో నాయకుడిగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అయితే టీమిండియా కెప్టెన్సీ చేపట్టే ముందు అతడు ఒక ముఖ్యమైన…

Read Full News

ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాల పురాతన శ్మశానవాటికలో కలకలం!

జగిత్యాల, నవంబర్ 1: జగిత్యాల పట్టణంలోని పురాతన శ్మశానవాటిక (కబరస్థాన్‌)లో రెండు అనుమానాస్పద బొమ్మలు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్లాస్టిక్ సంచిలో ఉంచిన ఈ బొమ్మలు స్థానికుల కంటపడటంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. బొమ్మలపై కనిపించిన గుర్తులు, వాటికి చేసిన ఏర్పాట్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. స్థానికులకు కనిపించిన ప్లాస్టిక్ సంచిని పరిశీలించగా అందులో బాలుడు, బాలిక ఆకారంలో ఉన్న రెండు బొమ్మలు ఉన్నట్లు తెలిసింది. ఈ బొమ్మలకు సూదులు గుచ్చి, నల్ల దారాలతో కట్టి…

Read Full News