తాజావార్తలు

ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాల పురాతన శ్మశానవాటికలో కలకలం!


జగిత్యాల, నవంబర్ 1: జగిత్యాల పట్టణంలోని పురాతన శ్మశానవాటిక (కబరస్థాన్‌)లో రెండు అనుమానాస్పద బొమ్మలు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్లాస్టిక్ సంచిలో ఉంచిన ఈ బొమ్మలు స్థానికుల కంటపడటంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. బొమ్మలపై కనిపించిన గుర్తులు, వాటికి చేసిన ఏర్పాట్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. స్థానికులకు కనిపించిన ప్లాస్టిక్ సంచిని పరిశీలించగా అందులో బాలుడు, బాలిక ఆకారంలో ఉన్న రెండు బొమ్మలు ఉన్నట్లు తెలిసింది. ఈ బొమ్మలకు సూదులు గుచ్చి, నల్ల దారాలతో కట్టి ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా పేర్లు రాసిన చీటీలను కూడా బొమ్మలకు అమర్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా బొమ్మలతో ఇలాంటి ఏర్పాట్లు చేసి శ్మశానవాటికలో వదిలివేయడం స్థానికుల్లో చర్చకు దారితీసింది.

బొమ్మలకు సూదులు గుచ్చడం, నల్ల దారాలతో కట్టడం, పేర్లతో కూడిన చీటీలు అమర్చడంతో ఇవి క్షుద్రపూజలకు సంబంధించినవేమోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బొమ్మలను అక్కడ ఎవరు ఉంచారు.. ఏ ఉద్దేశంతో ఉంచారు.. నిజంగానే క్షుద్రపూజలకు సంబంధించినవా.. లేక ఎవరైనా కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఈ చర్యకు పాల్పడ్డారా.. అన్నది ప్రస్తుతం అంతుచిక్కడం లేదు.

ఇవి కూడా చదవండి



పురాతన కబరస్థాన్‌లోకి ఈ బొమ్మలను ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు అక్కడ వదిలివెళ్లారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. బొమ్మలకు అమర్చిన చీటీల్లో ఉన్న పేర్లు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం అనుమానాల ఆధారంగా ఎలాంటి నిర్ధారణకు రాకుండా, బొమ్మల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని విచారణ ద్వారా తేల్చాల్సిన అవసరం ఉంది. మొత్తానికి జగిత్యాల పురాతన కబరస్థాన్‌లో లభించిన ఈ రెండు బొమ్మలు పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *