Andhra News: రైతన్న డొక్కపై మురసు ఎఫెక్ట్.. 30,661 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు!
మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. ఈ తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో దక్షిణ కోస్తా తీరాన్ని దాటిన మురసు తుఫాన్..గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులతో విరుచుకుపడింది. తీరం దాటిన తర్వాత కూడా తుపాను ప్రభావం తగ్గలేదు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గాలులకు 112 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో వందలాది చెట్లు నేలకూలాయి. కోస్తా ప్రాంతాల్లో మత్స్యకారుల పడవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15…
