తాజావార్తలు

Team India: న్యూజిలాండ్ టూర్‌కు పంత్ రెడీ.. అయితే షరతులు వర్తిస్తాయి..!

Team India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ టెస్ట్ జట్టుతో కలిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇరానీ కప్ సమయంలో గాయపడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సాధన చేస్తున్నాడు. రెండు రోజుల పాటు మ్యాచ్‌ను తలపించే పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 12న న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడు. దీంతో…

Read Full News

Telangana: 15 ఏళ్ల ప్రేమ బంధం రక్తసిక్తం.. నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో ఏం జరిగిందంటే.?

నల్లగొండకు చెందిన సతీష్, చండూరు మండలం పుల్లెంలకు మహబూబ్ బీ (43) ఇద్దరూ పోలీస్ శాఖలోనే హోంగార్డులుగా పని చేసేవారు. ఆ పరిచయం వీరి మధ్య కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరైనా, పెద్దలను ఎదిరించి 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఏడేళ్ల క్రితం సతీష్ హోంగార్డు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. దీంతో కుటుంబ…

Read Full News

బీటలు వారిన భూమి రక్షణ కవచం.. సౌర తుపాన్ల ప్రభావంపై శాస్త్రవేత్తల షాకింగ్ నిజాలు!

భూమి చుట్టూ రక్షణ వలయంలా ఉండే సహజ రేడియేషన్ కవచం ‘వాన్ అలెన్ బెల్ట్’‌కు భారీ సౌర తుపాన్ల వల్ల బీటలు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రహం చుట్టూ ఉన్న అంతరిక్షాన్ని శక్తిమంతమైన కణాల నుంచి భూమి అయస్కాంత క్షేత్రం ఎలా కాపాడుతుందనే దానిపై ఇప్పటివరకు ఉన్న అవగాహనను ఈ ఆవిష్కరణ పూర్తిగా మార్చివేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ జర్నల్ ‘జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్’‌లో ప్రచురితమయ్యాయి. భూమి చుట్టూ రెండు డోనట్ ఆకారపు ప్రాంతాలలో…

Read Full News

Rishikanth: సుకుమార్, రామ్ చరణ్ సినిమాలో డోరతి హీరో.. మూవీ లాంచ్ ఈవెంట్ పై క్లారిటీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’ (వర్కిగ్ టైటిల్). రంగస్థలం తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా.. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్…

Read Full News

Weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి వాయువ్య ఉత్తరప్రదేశ్ వరకు ఉన్న ద్రోణి.. ఇప్పుడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా వాయువ్య ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో చలి తీవ్రత ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొదలైంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట…

Read Full News

Punganur Cow: పుంగనూరు ఆవు, దూడకు రికార్డు ధర.. ఏకంగా రూ.5.30 లక్షలకు కొనుగోలు!

Punganur Cow: ఉభయ గోదావరి జిల్లాల్లోనే పుంగనూరు ఆవుకు అత్యధిక ధర పలికిందని ఫామ్ నిర్వాహకుడు అడబాల ప్రేమ్ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామం. గ్రామంలోని ఆధ్యశ్రీ డైరీ ఫామ్‌లో పెంచుతున్న స్వచ్ఛమైన పుంగనూరు జాతి ఆవు-గిత్తదూడ కు రికార్డు స్థాయిలో ధర లభించింది. మద్రాసుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఆవును ఏకంగా రూ.5 లక్షల 30 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఫామ్…

Read Full News

ప్రధాని మోదీతో ఎప్పుడూ మనస్ఫూర్తిగా మాట్లాడలేదు.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ, నవంబర్ 10: మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో ఆమె ప్రధాని మోదీతో తనకున్న సంబంధాలు, రాజకీయ విభేదాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ రాజకీయ లక్ష్యాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం నవంబర్ 10న పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. మోదీతో…

Read Full News

హైట్ పెరగాలనే పిచ్చి.. క్యాన్సర్ మందులు మింగుతున్న టీనేజర్లు!

సోషల్ మీడియాలో  ‘లుక్స్ మ్యాక్సింగ్’ (Looksmaxxing)  ట్రెండ్ యువతను ఆకర్షిస్తోంది.  కండలు తిరిగిన శరీరంతో మొదలయ్యే ఈ ట్రెండ్ కొందరిలో ప్రమాద స్థాయికి చేరుతోంది. పొడవుగా ఉంటేనే అమ్మాయిలకు నచ్చుతారని,  ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు.  అమెరికాలో  ‘షార్ట్ కింగ్’ మీమ్స్ పొట్టిగా ఉన్నవారిపై  జోకులు వేయడం టీనేజర్లను కుంగదీస్తున్నాయి.  మరికొన్ని అంగుళాలు హైట్ పెరగడానికి అడ్డదారులు వెతికే క్రమంలో క్యాన్సర్ మందు మింగుతున్నారు. 15 ఏళ్లకే క్యాన్సర్ మందు.. నెలకు రూ.25 వేలకు పైగా…

Read Full News

ఆ హీరో నన్ను ఏయ్ పెద్దిరెడ్డి, ఇటు రా రా..! అని పిలుస్తారు.. చాలా మంచి వ్యక్తి :సునీల్ రెడ్డి

నటుడు సునీల్ రెడ్డి ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న దాదా చిత్రంలో తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణతో కలిసి పనిచేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదా చిత్రం మైసూర్, హైదరాబాద్‌లలో చిత్రీకరణ జరుపుకుంటుండగా, సునీల్ రెడ్డి ఇప్పటికే 15 రోజుల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఆయనది పెద్ద పాత్ర అని, ముఖ్యంగా రెండో అర్ధభాగంలో సాగే ఒక ఫ్యామిలీ డ్రామాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని…

Read Full News

అనంతసాగర్ సమీపంలో భారీ మొసలి కలకలం.. భయంతో వణుకుతున్న గ్రామస్తులు!

సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ సమీపంలోని చౌదరి చెరువులో ఉదయం రైతులకు భారీ మొసలి ఒక్కసారిగా కనిపించింది. దీంతో చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పంటపొలాలకు వెళ్లే రైతులు, పశువులకు చెరువులో నీళ్లు తాపేందుకు వచ్చే గ్రామస్తులు మొసలి భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి మొసలి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో చెరువు…

Read Full News