తాజావార్తలు

అనంతసాగర్ సమీపంలో భారీ మొసలి కలకలం.. భయంతో వణుకుతున్న గ్రామస్తులు!


సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ సమీపంలోని చౌదరి చెరువులో ఉదయం రైతులకు భారీ మొసలి ఒక్కసారిగా కనిపించింది. దీంతో చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పంటపొలాలకు వెళ్లే రైతులు, పశువులకు చెరువులో నీళ్లు తాపేందుకు వచ్చే గ్రామస్తులు మొసలి భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి మొసలి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో చెరువు పరిసరాల్లో ఎలాంటి ప్రమాదం జరగకముందే అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. భారీ మొసలిని సురక్షితంగా బంధించి, ప్రజలకు ప్రాణహాని లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *