తాజావార్తలు

The Odyssey OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’.. 15 వేల కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే


హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ది ఒడిస్సీ’. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనివినీ ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది జూలై 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఒడిస్సీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలోనూ ఈ సినిమాకు రికార్డు వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ సినిమాను ఎగబడి చూసేశారు. సెలబ్రిటీలు కూడా ఫస్ట్ షోకే థియేటర్లకు క్యూ కట్టారు. అందుకు తగ్గట్టుగానే రూ.2,100 కోట్లకు పైగా ($250 మిలియన్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ది ఒడిస్సీ ఏకంగా $1.78 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.15,000 కోట్లు) వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇక ఇండియాలో కూడా ఈ సినిమా సుమారు రూ.191 కోట్లు రాబట్టింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మేరకు ది ఒడిస్సీ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను కాపాడేందుకు ది ఒడిస్సీ మూవీ కోసం నోలన్ దాదాపు 120 రోజుల సుదీర్ఘ థియేట్రికల్ విండోను పాటించారు. ఈ క్రమంలోనే నవంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియో , ఆపిల్ టీవీ వంటి తొమ్మిది ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

కాగా ది ఒడిస్సీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. మొదటగా ఈ సినిమా వీడియో ఆన్ డిమాండ్ (PVOD) అంటే రెంట్ లేదా బై (Rent/Purchase) పద్ధతిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉచితంగా చూసే అవకాశం కల్పించనున్నారు.

ది ఒడిస్సీ సినిమా విషయానికి వస్తే.. హోమర్ రాసిన ప్రఖ్యాత గ్రీకు ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు క్రిస్టోఫర్ నోలన్. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, జెండాయా, లుపితా న్యోంగో తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్ సుమారు రూ. 2, 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

నవంబర్ 17 నుంచి ఓటీటీలో ది ఒడిస్సీ…

ది ఒడిస్సీ సినిమా ట్రైలర్ తెలుగులో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *