RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక
హైదరాబాద్, జులై 12: రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నియామక ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామకం పారదర్శకంగా జరుగుతోందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలోని డిపోల పరిధిలో కొనసాగుతున్న తాత్కాలిక కండక్టర్ల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అధికారిక కాంట్రాక్ట్…
