తాజావార్తలు

S Janaki: మా హృదయాలు భారంగా ఉన్నాయి.. ఎస్‌ జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

S Janaki: మా హృదయాలు భారంగా ఉన్నాయి.. ఎస్‌ జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్


సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్. జానకి శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె మనవరాలు అప్సరా వైద్యుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ అప్సరా భావోద్వేగానికి గురయ్యారు.

లెజెండరీ సింగర్ ఎస్. జానకి.. మా నాన్నమ్మ ఇకలేరనే విషయాన్ని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాను అని అప్సరా పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని.. “మా హృదయాలు భారమైనప్పటికీ, ఆమె గడిపిన అసాధారణమైన జీవితానికి, తన అమరగానంతో కోట్ల మందికి అందించిన అపారమైన ఆనందానికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం” అన్నారు.

“ప్రపంచానికి ఆమె దిగ్గజ గాయని.. తన పాటలతో ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన ఒక అద్భుతమైన గాత్రం. కానీ మా కుటుంబానికి మాత్రం ప్రేమ, వినయం, దయ, నిరాడంబరత నేర్పిన మా నాన్నమ్మ” అని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆమె చూపిన ఆత్మీయత ఎప్పటికీ తమతోనే ఉంటుందన్నారు. ఈ కష్టసమయంలో బాధ నుండి కోలుకోవడానికి తమ వ్యక్తిగత సమయాన్ని గౌరవించవలసిందిగా కోరారు. అలాగే తమ కుటుంబానికి అండగా నిలుస్తూ, ప్రేమను అందిస్తూ ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మనవరాలి పోస్ట్ చూడండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *