Kai Chutney: నోరూరించే ఎర్ర చీమల చట్నీ.. ఆ రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
భారత్‌లో విభిన్న సంస్కృతులతో పాటు ఎన్నో రకాల విలక్షణమైన సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వాటిలో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే ఒక వింతైన, ప్రత్యేకమైన వంటకం ‘ఎర్ర చీమల చట్నీ’. వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా , జార్ఖండ్ వంటి రాష్ట్రాలలోని అనేక గిరిజన వర్గాలు ఎన్నో శతాబ్దాలుగా ఈ చట్నీని తమ దైనందిన ఆహారంలో ఒక భాగంగా చేసుకుని తింటున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకమైన ఘాటు, పులుపు-కారం రుచి , సాంస్కృతిక ప్రాముఖ్యత…
