టాలీవుడ్ వర్గాల నుంచి వస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ , డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలలో ప్రియదర్శి పులికొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇడుపు కాయితం’ ఒకటి. వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే ప్రియదర్శి, ఈసారీ మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె వెండితెరపై సందడి చేయబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన శ్రీలత సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ సాంగ్‌ను విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..
పెళ్లైన ప్రతి అమ్మాయి అత్తారింట్లోకి అడుగుపెట్టే సమయంలో కలిగే భయాన్ని ఈ పాటలో చూపించారు. “ఏ ఇంటి కోయిలవో నువ్వు మా ఇంటికొచ్చి…” అంటూ సాగే ఈ పాటలోని ప్రతీ పదం మనసును హత్తుకునేలా ఉంది. కుటుంబ విలువలు, కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టే మహిళ ప్రాముఖ్యత , వారి మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాట ద్వారా అత్యంత సుందరంగా ఆవిష్కరించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. జానపద బాణీని తలపించేలా సాగే ఈ మెలోడీ సాంగ్‌కు అభినయ శ్రీనివాస్ అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంది. అలాగే ఫోక్ సింగర్ తేలు విజయ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. మొత్తంగా ఈ సాంగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..
తెలంగాణ మట్టి వాసన ఉట్టిపడే పదప్రయోగం, పల్లెటూరి సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో సాగే ఈ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు , టీజర్ ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రాన్ని డిసెంబరు 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రియదర్శి, ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!
గడప సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..
