తాజావార్తలు

Gold Prices: సగానికి సగం పడిపోనున్న బంగారం ధరలు..! కాస్త ఆగండి.. వెలుగులోకి షేకింగ్ న్యూస్..


బంగారం ధరల్లో గత రెండున్నరేళ్లుగా భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఏకంగా తులం బంగారం రూ.1.83 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. 2026,జనవరి 29న ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,83,050కి చేరుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. రూ.2 లక్షల మార్క్‌కు చేరుకుంటుందని అందరూ ఊహించగా.. అంచనాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. ఆ తర్వాత నుంచి ధరలు పతనమవుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 23వ తేదీ నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర భారత్‌లో రూ.1,42,480కి చేరుకోగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,600 వద్ద కొనసాగుతోంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు సగానికి సగం పడిపోనున్నాయనే వార్తలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

బంగారం ధరలు సగానికి సగం పడిపోతాయా..?

బంగారం ధరలు రానున్న రోజుల్లో సగానికి సగం పడిపోనున్నాయనే మాట నిపుణుల నోట వినిస్తోంది. దీనికి కారణం పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుండమే కారణం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన మారధాన్ ప్యూజన్ అనే సంస్థ పాదరసాన్ని బంగారంగా మార్చి చరిత్ర సృష్టించింది. ఇటీవల డ్యూటీరియం-ట్రిటియం న్యూట్రాన్లను ఉపయోగించి పాదరసాన్ని కేంద్రక సలీన చర్యకు గురి చేయడంద ద్వారా గోల్డ్ 197 ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఏకంగా పాదరసం ద్వారా ఏకంగా 10 రేట్లు ఎక్కువ స్వచ్చమైన బంగారం సృష్టించారు. రాబోయే కొన్నేళ్లల్లో పాదరసం ద్వారా తయారుచేసిన స్వచ్చమైన బంగారం మార్కెట్లోకి రావడం వల్ల సరఫరా పెరిగి ధరలు భారీగా కుప్పకూలే ఛాన్స్ ఉంది. రాబోయే కొన్నేళ్లల్లోనే దీనిని మనం చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

50 శాతానికిపైగా ధరలు పడిపోయే ఛాన్స్..!

ఇప్పటికే కృత్రిమంగా సృష్టించిన వజ్రాలు మార్కెట్లోకి వచ్చాయి. సింథటిక్ వజ్రాలు రావడం వల్ల వీటి ధరలు 50 శాతానికిపైగా పడిపోయాయి. రాబోయే రోజుల్లో సింథటిక్ బంగారం కూడా మార్కెట్లోకి వస్తే ధరలు సగానికి సగం పడిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భూమిలోని బంగారాన్ని వెలికితీయడానికి, శుద్ది చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అదే పాదరసం ద్వారా బంగారం ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. దీని వల్ల ఈ విధానంలో తయారుచేసిన స్వచ్చమైన బంగారం చవక ధరకే లభించనుంది. అయితే 2025లో  అణు విచ్ఛిత్తి ద్వారా బంగారం ఉత్పత్తి చేయగా.. ఇది రేడియోధార్మికతను కలిగి ఉంటుంది. దీనిని  7 నుంచి 17 సంవత్సరాల పాటు సురక్షితంగా నిల్వ చేసిన తర్వాత మాత్రమే వినియోగించడానికి వీలు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ బంగారం కూడా మార్కెట్లోకి రావడం వల్ల ధరలు మరింతగా పడిపోయే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *