తాజావార్తలు

Cyclone Alert: ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లోనే


ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, ఆనుకొని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది అదే ప్రాంతంలో కొనసాగుతూ శనివారం వాయుగుండంగా, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది మరింత బలపడి ఆ తదుపరి 2 రోజులలో ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలన్నారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆది వారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; కోస్తాంధ్రలో సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు, రైతులు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయం, తుపాను సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నంబర్లు సంప్రదించాలన్నారు.

రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

శనివారం ( 24-10-2026) : కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా , గుంటూరు, బాపట్ల, ప్రకాశం ,రాయలసీమ జిల్లాలో జిల్లాలో అక్కడక్కడ తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం ( 25-10-2026) : అల్లూరి ,పోలవరం, కృష్ణా , గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సోమవారం (26-10-2026): రాయలసీమ జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం ( 27-10-2026) : విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ; ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం (28-10-2026) : అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ; గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *