సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా.. ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే : వి.ఎన్. ఆదిత్య
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య శ్రీరామ్ చిత్ర ఫలితం, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీరామ్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆదిత్య అన్నారు. ఆదిత్య దృష్టిలో, శ్రీరామ్ సినిమా ఒక యాక్షన్ కథాంశంతో రూపొందించబడినప్పటికీ, దాని మార్కెటింగ్ వ్యూహం తప్పుగా అమలు చేయబడిందని అన్నారు. సినిమాను లవ్ స్టోరీలా కాకుండా, హీరో పాత్ర పేరు శ్రీరామ్ తోనే విడుదల చేయాలని, దానిని యాక్షన్ చిత్రంగా ప్రచారం చేయాలని…
