తాజావార్తలు

మల్కాజిగిరిలో పోలీసుల మెగా ఆపరేషన్.. 54 చెక్‌పోస్టులు, 1,098 మంది సిబ్బందితో విస్తృత తనిఖీలు!


మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మూడు జోన్లలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఎల్‌బీ నగర్ జోన్‌లో అత్యధికంగా తనిఖీలు చేపట్టారు. ఈ జోన్ పరిధిలో 1,392 వాహనాలు, 1,111 మంది వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 20 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 57 పెట్టీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మరోవైపు నగదు, మద్యం, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 118 పెట్టీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం. రాత్రి వేళల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెంచడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *