
ఫ్రెంచ్ ఓపెన్ 2026లో తెలుగుతేజం పీవీ సింధు సత్తా చాటింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో జపాన్‌కు చెందిన హినా అకేచీతో పీవీ సింధు తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో హినా అకేచీని ఓడించి పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ గంటా 13 నిమిషాల పాటు జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంక్ అయిన జపనీస్ క్రీడాకారిణిపై 21-10, 20-22, 21-16 తేడాతో పీపీ సింధు విజయం సాధించింది. జులైలో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ గెలుచుకున్న వీవీ సింధు.. ఇప్పుడు ఈ గెలుపుతో BWF సూపర్ 750 ఫైనల్‌కు చేరుకుందని చెప్పవచ్చు.
ఫ్రెంచ్ ఓపెన్ 2026 ఫైనల్లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి ఆన్ సే-యంగ్‌తో పీవీ సింధు తలపడనుంది. ఫైనల్లో నెంబర్ వన్ క్రీడాకారిణీతో తలపడాల్సి ఉండటంతో పీవీ సింధు కఠిన సవాల్‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో ఫైనల్లో అత్యత్తుమ ప్రదర్శన కనబరుస్తానని పీవీ సింధు తెలిపారు. ఆన్ సే-యంగ్ మంచి ఫామ్‌లో ఉందని, తాను ఆమెకు గట్టి పోటీ ఇవ్వాలని అన్నారు. మ్యాచ్‌లో ప్రతి పాయింట్ ముఖ్యమేనని, ఆమెతో చాలాసార్లు ఆడానని తెలిపారు. ఆమె చాలా బాగా ఆడుతోందని, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంటుందని తాను ఆశిస్తున్నానని పీపీ సింధు అన్నారు. తాను మైదానంలోకి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పేర్కొన్నారు.
