తాజావార్తలు

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఈజీ.. ఇంటి వద్ద నుంచే ఇలా..


కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 24వ విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 30వ తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిధులను రిలీజ్ చేయనున్నారు. ఇవి ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం నుంచి ప్రకటన రావడంతో నిరీక్షణకు తెరపడినట్లయింది. గుజరాత్‌లో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ 24వ విడత డబ్బులను మోదీ రిలీజ్ చేయనున్నారు. దీపావళికి ముందే అకౌంట్లోకి డబ్బులు వస్తుండటంతో రైతుల ఆనందం రెట్టింపు కానుంది. అయితే పీఎం కిసాన్ వెబ్‌సైట్లో రైతులు తమ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్‌లో కేవైసీ పూర్తి చేసుకునేందుకు, స్టేటస్ తెలుసుకునేందుకు, ఇతర మార్పులు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

పీఎం కిసాన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా..?

–పీఎం కిసాన్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-దిగువన ఫార్మర్స్ కార్నర్ విభాగంలో అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి

-సెర్చ్ బై దగ్గర మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అప్డేట్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ద్వారా అయితే దానిని ఎంచుకోవాలి

-అనంతరం పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి

-క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీ ప్రస్తుత మొబైల్ నెంబర్, మీ వివరాలు అక్కడ కనిపిస్తాయి

-అనంతరం బాక్స్‌లో మీ కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ప్రక్రియ పూర్తి చేయండి

-ఆ తర్వాత ఆథార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోండి

-ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయండి

-అనంతరం మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది

మొబైల్ నెంబర్ ఎందుకు అవసరం..?

పీఎం కిసాన్ కేవైసీ పూర్తి చేయాలంటే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీంతో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటే మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ అవసరం. ఇక మీరు పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మీ బెనిఫిషియరీ స్టేటస్ తెలుసుకోవాలన్నా ఓటీపీ ధృవీకరణ అవసరం. దీంతో పనిచేసే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పీఎం కిసాన్ అప్డేట్స్, నిధుల జమకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందుకోవాలన్నా ఉపయోగపడుతుంది. దీంతో లబ్దిదారులందరూ ఇంటి వద్ద నుంచే తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ విధానంలో సులువుగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *