యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ 5వ వార్షికోత్సవ వేడుకలు మహిళా సాధికారత, ఐక్యతకు వేదికగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ముఖ్య అతిథిగా హాజరై, స్ఫూర్తిదాయకమైన కామెంట్స్ చేశారు. వైజాగ్ నుండి వచ్చిన హైమ గారు ఉపాసనకు ప్రత్యేకమైన ఖాదీ చీరను బహుకరించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాసన తన ప్రసంగాన్ని ప్రారంభించకముందు, కార్యక్రమ నిర్వాహకురాలు సుమ కనకాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, “ఐయామ్ స్టక్ ఇన్ ఎక్సలెన్స్” అని సుమ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. సుమ కనకాల శక్తివంతమైన, ఆత్మవిశ్వాసం కలిగిన, విజయవంతమైన మహిళ అని ప్రశంసించారు. “ఆమెలో ఆత్మవిశ్వాసం ఆమె నుండే వచ్చింది, మనమంతా ఆమె నుండి స్ఫూర్తి పొందుతాము” అని ఉపాసన పేర్కొన్నారు. అనేక ఆడియో ఫంక్షన్లలో సుమ షోను ఎంత సమర్థవంతంగా నడిపిస్తారో, ఆమె ఎంత మంది హృదయ స్పందనలను ఎంత సునాయాసంగా నిర్వహిస్తారో ఆమె వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
అనంతరం, ఉపాసన తన కీలక సందేశాన్ని అందించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఒక లోతైన సమస్యను ఆమె ప్రస్తావించారు. కొందరు మహిళలు తమ సొంత విజయాల కోసం, లేదా బలహీనమైన పురుషుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇతర మహిళలను తొక్కేస్తున్నారని ఆమె హెచ్చరించారు. ఈ ప్రవర్తన సరికాదని, “ఒక మహిళ నొప్పి మరొక మహిళ విజయం కాకూడదు” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
మహిళలందరూ కలిసికట్టుగా ఉండాలని, ఒకరికొకరు మద్దతునిచ్చుకుంటేనే పురోగమించగలరని ఉపాసన పిలుపునిచ్చారు. “మనం కలిసి ఎదగాలంటే, మనం కలిసి ఉండాలి, మన ఆలోచన విధానం మారాలి” అని ఆమె స్పష్టం చేశారు. స్వార్థం లేకుండా మహిళలను ప్రోత్సహించే వారితోనే తాను నిరంతరం ఉంటానని, అన్యాయం చేసిన వారికి కూడా మారడానికి, కోలుకోవడానికి ఒక అవకాశం ఇస్తానని ఉపాసన తెలిపారు. సానుకూల దృక్పథంతో, మహిళలు ఒకరినొకరు శక్తివంతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
