తాజావార్తలు

Hyderabad: గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో ఏదో మెరుస్తూ కనిపించింది.. పరిశీలించగా..


హైదరాబాద్‌లోని కవాడిగూడ పవర్ గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్రూమ్‌లో సీక్రెట్‌గా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. వాష్‌బేసిన్ కింద డబుల్ సైడెడ్ టేప్‌తో ఫోన్‌ అతికించిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అక్టోబర్ 13న జరిగిన ఈ వ్యవహారం అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది. మహిళల భద్రతను మరోసారి ప్రశ్నిస్తోంది.

వాష్‌రూమ్‌కి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగి మొబైల్‌ ఫోన్‌ను గుర్తించింది. అసలీ ఫోన్‌ ఎవరిదని ఆరా తీయగా… అటెండెంట్ భరత్‌దని తేలింది. భరత్‌ని నిలదీయగా… ఫోన్‌లాక్కుని పరారయ్యడా కేటుగాడు. దీంతో సహోద్యోగులు, భద్రతా సిబ్బంది సహకారంతో అటెండెంట్‌ను ఉద్యోగులే పట్టుకున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు… ఫోన్‌లోని వీడియోలు పరిశీలించేందుకు ప్రయత్నించగా పిన్‌లాక్ ఫోల్డర్ గుర్తించారు. పిన్ నంబర్ అడగ్గానే భయపడిపోయిన భరత్ ఫోన్‌ను నేలకేసి కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు. లోతైన దర్యాప్తు కోసం కేసును సిటీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ధ్వంసమైన ఫోన్ నుంచి డేటా రికవరీ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అంతకుముందు ఇదే హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఓ మహిళ తన అద్దె ఇంటి బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో కెమెరాను గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఇంటి యజమానే ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. అలాగే… శంషాబాద్‌లోని ఓ హోటల్ యజమాని.. గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి, జంటల ప్రైవేట్ టైమ్‌ని చిత్రీకరించి డబ్బుల కోసం బెదిరించిన కేసు అప్పట్లో ఓ సంచలనమే రేపింది. అంతెందుకు… గతేడాది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరా అమర్చిన కేసు జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లింది. 300కు పైగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులంతా రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు.

అలాగే 2025 మేలో మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్ ఘటన ఆ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఓ షాపింగ్ మాల్‌లోని ట్రయల్‌ రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టిన యజమానిపై యావత్‌ మహిళాలోకం విరుచుకుపడింది. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు… షాపింగ్‌ మాల్ యజమానే కెమెరాలు పెట్టి, చిత్రీకరించిన వీడియోలను ఎంతోమందిని షేర్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. అలాగే బెంగళూరులోని ఓ థియేటర్‌ వాష్‌రూమ్‌లోనూ కెమెరాలు ఆమర్చిన ఘటన సిటిని కొన్నిరోజులపాటు షేక్ చేసింది. ఒడిశాలోని ప్రభుత్వ కార్యాలయంలో, ఉత్తప్రదేశ్‌లోని ఓ డిజిటల్ లైబ్రరీలోనూ ఇలాంటి దుర్మార్గానికే పాల్పడ్డారు కేటుగాళ్లు.

వాయిస్ః మొత్తంగా… మహిళలూ బీ కేర్‌ఫుల్. మీరు అడుగుపెట్టే గది హోటల్‌దైనా… మీరు ఉంటున్న ఇల్లు అయినా… బట్టలు మార్చుకునే ట్రయల్ రూమ్ అయినా… అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే… మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను కెమెరా కంటితో బంధించే కిరాతకులు సమాజంలో రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఆ దృశ్యాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగే నేరగాళ్లూ పెరిగిపోతున్నారు. సో… అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయకండి… మీ భద్రత విషయంలో రాజీ పడకండి. అనుమానాస్పద పరికరం కనిపిస్తే దాన్ని తాకకుండా సురక్షిత ప్రదేశానికి వెళ్లండి. అవసరమైతే పోలీసులకు సంప్రదించడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *