తాజావార్తలు

దోమల బెడదతో విసిగిపోయారా? ఇంట్లోనే ఈ సహజ చిట్కాలతో దోమలను తరిమేయండి!

Mosquito Control Tips Telugu: వర్షాకాలంలో దోమల బెడద మరింత పెరుగుతుంది. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచిన వెంటనే దోమలు లోపలికి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి కాటుతో దురద, చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా, కొన్ని దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది మస్కిటో కాయిల్స్, లిక్విడ్ రిపెల్లెంట్స్, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిపై పూర్తిగా ఆధారపడకుండా, దోమలను నియంత్రించేందుకు కొన్ని సహజ పద్ధతులను…

Read More

Telangana: ఛీ.. ఛీ ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీ అనే మహిళకు షేక్ సుభాని అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకుని కష్టపడి పెంచిన సైదాబీ, కొన్నేళ్ల క్రితమే అతనికి పెళ్లి కూడా చేసింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సుభాని తాగుడుకి బానిస అవ్వడంతో ఏడాది క్రితమే అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read More

అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన నహీద్ కౌసర్ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నహీద్ కౌసర్ అదే ప్రాంతానికి చెందిన ఫర్వేజ్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ కలసి జీవించడమే కాకుండా ఉమ్మడిగా హ్యాండ్‌బ్యాగుల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా…

Read More

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

వీసాల జారీ విషయంలో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించే అమెరికా తాజాగా భారతీయులకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి యూఎస్ విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ కొన్ని వారాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. భారతీయుల నుంచి ఈ వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది….

Read More

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!

OG యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుందా..? పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..? పుట్టిన రోజు నాడు కోరుకున్న అప్‌డేట్ అయితే రాలేదు కానీ చూసి పండగ చేసుకునే అప్‌డేట్ అయితే కచ్చితంగా వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా సుజీత్ వదిలిన ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. మరి ఈ భారీ సీక్వెల్ విశేషాలేంటో చూద్దామా..? ఓజీ సీక్వెల్ గురించి వద్దన్నా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం…

Read More

గన్నేరు ఆకులతో పప్పు కూర.. అంగన్‌వాడీలో భోజనం తిని ఐదుగురికి అస్వస్థత!

ఖమ్మం, సెప్టెంబర్ 4: గన్నేరు ఆకులు పొరపాటున పప్పులో కలవడంతో ఆ భోజనం తిన్న ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ కేంద్రం 3లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నాగమణి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో…

Read More
పేను కొరుకుడు సమస్యకు-ఇంటి చిట్కాలు | దురద, మంట తగ్గించుకోవడం ఎలా?

పేను కొరుకుడు సమస్యకు-ఇంటి చిట్కాలు | దురద, మంట తగ్గించుకోవడం ఎలా?

పేను కొరుకుడు వల్ల తలపై లేదా శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో దురద, మంట, ఎర్రటి మచ్చలు, చిన్న చిన్న పొక్కులు కనిపించవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే, పేను సమస్య వచ్చినప్పుడు గోళ్లతో గట్టిగా గోకడం వల్ల చర్మంపై గీతలు పడటమే కాకుండా, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, ముందుగా సమస్యకు కారణం ఏమిటో గుర్తించడం చాలా ముఖ్యం. సాధారణంగా తల పేను ఉంటే తలలో…

Read More

జస్ట్.. ఇలా చేస్తే చాలు.. తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా కళకళలాడటం పక్కా..

మన దేశంలో తులసి మొక్క లేని ఇల్లు ఉండడం చాలా అరుదు. ఇంటికి పవిత్రతను, అందాన్ని తీసుకురావడమే కాకుండా.. తులసిలో ఉన్న ఔషధ గుణాలు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలామంది ఇళ్లలో తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే వాడిపోవడం, ఆకులు రాలిపోయి ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, తులసి మొక్క ఏడాది పొడవునా పచ్చగా, దట్టంగా పెరిగేందుకు ప్రముఖ గార్డెనింగ్ నిపుణుడు తరుణ్ చోప్రా సోషల్…

Read More

ఒంటి కాలితో గెంతుతూ రోజూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన చూడండి! వీడియో

బలియా, సెప్టెంబర్‌ 4: చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి నిరూపిస్తోంది. రాగిణికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది. ఓ కాలు దెబ్బతిన్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ దాదాపు 400 మీటర్ల దూరాన్ని ఒంటికాలిపై గెంతుతూ వెళ్తోంది. రాగిణికి కేవలం ఆరు నెలల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా…

Read More

Brain Fog : వైరల్ జ్వరం తగ్గినా.. మెదడు మాత్రం స్లోగా ఉందా? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలివే!

ప్రతి బ్రెయిన్ ఫాగ్‌ను వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావమే అని భావించడం సరికాదు. లక్షణాలు క్రమంగా తగ్గుతూ ఉంటే సాధారణంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అవి కొన్ని వారాల పాటు కొనసాగడం, మరింత తీవ్రం కావడం లేదా రోజువారీ పనులు, ఉద్యోగం, చదువుపై గణనీయమైన ప్రభావం చూపడం వంటివి జరిగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ముఖ్యంగా అకస్మాత్తుగా గందరగోళం, మాట తడబడటం, శరీరంలో ఒకవైపు బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం…

Read More