హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం.. టోల్ టాక్స్ వసూళ్ల కోసం కొత్త చట్టం..!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వేదికగా అంతర్జాతీయ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం త్వరలోనే ఒక సరికొత్త వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, జలసంధిని దాటే నౌకలపై ప్రత్యేకంగా ‘టోల్ పన్ను’ విధించనున్నారు. యుద్ధ నష్టాలను భర్తీ చేయడానికి, తమ సముద్ర తీర రక్షణ వ్యయాన్ని రాబట్టుకోవడానికే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ స్పష్టం…
