పాత ఆభరణాలను తిరిగి తయారు చేసినప్పుడు ఏమి జరుగుతుంది? : పాత ఆభరణాలను కరిగించడం, శుభ్రపరచడం, శుద్ధి చేసే ప్రక్రియలో కొంత బంగారం అనివార్యంగా నష్టపోతుంది. దీని ఫలితంగా ఆభరణాల వ్యాపారులు సాధారణంగా ఈ నష్టానికి 5% నుండి 8% వరకు “వేస్టెజ్ రుసుము”ను వసూలు చేస్తారు. అదనంగా ఆభరణాలలో పొదిగిన రాళ్లు, ముత్యాలు, ఎనామెల్ పని లేదా ఇతర బంగారం కాని భాగాలను తొలగిస్తారు. అలాగే విలువ కేవలం స్వచ్ఛమైన బంగారు పరిమాణం బరువు ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారు. అంతేకాకుండా కొంతమంది ఆభరణాల వ్యాపారులు మార్కెట్ నష్టాలు, ధరల హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోవడానికి మరిన్ని తగ్గింపులను కూడా వర్తింపజేయవచ్చు.
